జాతీయ ఓటర్ల దినోత్సవం ర్యాలీ
National Voter's Day Rally
18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలి
-జగిత్యాల ఆర్డిఓ మధుసూదన్…
జగిత్యాల
పట్టణంలో జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేసిన ఓటరు అవగాహన ర్యాలీకి ముఖ్యఅతిథిగా ఆర్డిఓ హాజరై ర్యాలీని ప్రారంభించారు.
ఈ సందర్భంగా స్వామి వివేకానంద మినీ స్టేడియం నుండి పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు.
అనంతరం విద్యార్థులతో, యువకులతో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో మధుసూదన్ మాట్లాడుతూ భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని అందులో ఓటరు కీలకమని చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు కీలకమని, ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు కలిగి ఉండాలని అన్నారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
భారత దేశ ఎన్నికలలో పాల్గొని తమకు నచ్చిన వ్యక్తిని ఎన్నుకోవడానికి భారత ఎన్నికల సంఘం ప్రతి పౌరుడికి ఓటు హక్కును కల్పించిందని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
25 జనవరి 1950 సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది కాబట్టి ప్రతి సంవత్సరం జనవరి 25వ తేదీన జరుపుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి రవి కుమార్, ఎన్సీసీ అధికారులు, ప్రభుత్వ అధికారులు, డాక్టర్ గోపాల చారి, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.



