నేచురల్ స్టార్ నాని ‘హాయ్ నాన్న’ ట్రైలర్ నవంబర్ 24న విడుదల

- Advertisement -

నేచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్, శౌర్యువ్, వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ 

నేచురల్ స్టార్ నాని హోల్సమ్ ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘హాయ్ నాన్న’.  వైర ఎంటర్‌టైన్‌మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్‌ గా రూపొందిన ఈ చిత్రం ద్వారా శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. పాన్-ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపించనుంది.

మేకర్స్ ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌కి సంబంధించిన అప్‌డేట్‌ని అందించారు. నవంబర్ 24న లాంచ్ చేయనున్నారు. ట్రైలర్ పోస్టర్ లో లీడ్ పెయిర్ – నాని, మృణాల్ ఠాకూర్ అద్భుతమైన కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు. టీజర్, పాటలు ప్రామిస్ చేసినట్లుగా హాయ్ నాన్న ఎమోషన్స్ తో కూడిన రోలర్‌కోస్టర్ రైడ్‌గా ఉండబోతోంది.మోహన్ చెరుకూరి (CVM), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించిన ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించారు. ఇప్పటికే విడుదలైన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా అలరిస్తున్నాయి.

Natural star Nani 'Hi Nanna' trailer released on November 24
Natural star Nani ‘Hi Nanna’ trailer released on November 24

చిత్రానికి సాను జాన్ వర్గీస్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎడిటర్‌గా ప్రవీణ్ ఆంథోని, ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా గా పని చేస్తున్నారు. సతీష్ ఈవీవీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత.‘హాయ్ నాన్నా’ డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: నాని, మృణాల్ ఠాకూర్, బేబీ కియారా ఖన్నా

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular