- Advertisement -
రిపబ్లిక్ డే పరేడ్ 2025కు ఎన్సిసి క్యాడేట్ ఎంపికయిన
NCC Cadet selected for Republic Day Parade 2025
ఖని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి
గోదావరిఖని :
ప్రతిష్టాత్మక రిపబ్లిక్ డే పరేడ్ 2025 కు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి ఎంపిక అయ్యారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని న్యూ ఢిల్లీ లో జరిగే ఈ పరేడ్ కు కళాశాల విద్యార్థి మహమ్మద్ మక్బూల్ హుస్సేన్ ఎంపిక అయ్యారు. దాదాపు 8 క్యాంపులలో వివిధ దశల్లో వడపోతల తర్వాత మక్బూల్ హుస్సేన్ ఎంపిక జరిగింది. కళాశాల విద్యార్థి ఎంపిక పట్ల కళాశాల ప్రిన్సిపాల్ జై కిషన్ ఓజా హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సాంబశివరావు, ఎన్సిసి అధికారి లెఫ్టినెంట్ బి తిరుపతి , అధ్యాపకులు సుబ్బారావు, సవిత, శారద, కిరణ్మయి, ఆంజనేయులు, శ్రీదేవి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -