Sunday, September 8, 2024

సూర్యుని దగ్గరకు.. ఆదిత్య – L1 ప్రయోగం  

- Advertisement -

PSLV – C57 రాకెట్ ద్వారా ప్రయోగం

near-the-sun-aditya-l1-experiment
near-the-sun-aditya-l1-experiment

ఉమ్మడి నెల్లూరు జిల్లా:  భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో అద్భుతానికి సిద్దమవుతుంది, ఈ రోజు ఉదయం   11 గంటల 50 నిమిషాలకు PSLV -C57 రాకెట్ ద్వారా ఆదిత్య – L1 మిషన్ ను ప్రయోగిస్తోంది, చంద్రయాన్ – 3 విజయ గర్వం తో ఇస్రో ప్రపంచదేశాల దృష్టిని  ఆకర్షించింది, అదే స్ఫూర్తి తో ఇప్పుడు సూర్యుని చుట్టూ దాగి ఉన్న వాతావరణ రహస్యాల గుట్టు విప్పడానికి సిద్దమైంది, షార్ నుండి ఇస్రో ఉదయం PSLV – సి 57 రాకెట్ ద్వారా ఆదిత్య L1 మిషన్ ను ప్రయోగించబోతుంది,ఆదిత్య L1 అనేది సూర్యుని గురించి అధ్యయనం చేసే మొదటి అంతరిక్ష ఆధారిత భారతీయ మిషన్. ఆదిత్య L1 మిషన్ ను  భూమి నుండి 1.5 మిలియన్ కిమీ దూరంలో ఉన్న సూర్యునికి భూమికి మధ్య ఉండే   లాగ్రాంజ్ పాయింట్ 1 (L1) చుట్టూ ఒక హాలో కక్ష్యలో ఉంచబడుతుంది. L1 పాయింట్ చుట్టూ ఉన్న హాలో కక్ష్యలో ఉంచబడిన ఆదిత్య మిషన్  ఎటువంటి గ్రహాలూ అడ్డు లేకుండా సూర్యుడిని నిరంతరం వీక్షించే విదంగా అంతరిక్షం లో నిలపడం జరుగుతుంది,  ఇది ఉష్ణోగ్రత మార్పులను వాటి పరిమాణాలు అక్కడ జరిగే వాతావరణ మార్పులను గమనించి సమాచారాన్ని అందిస్తుంది,  మాగ్నెటిక్ ఫీల్డ్ డిటెక్టర్‌లను ఉపయోగించి ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ మరియు సూర్యుని (కరోనా) బయటి పొరలను పరిశీలించడానికి ఇందులో ఎడురకాల పరికరాలను అమర్చి ఉన్నారు, భవిషత్ లో  సోలార్ ఎనర్జీ అభివృద్ధికి ఆదిత్య L1 మిషన్ ప్రయోగం ఉపయోగపడుతుంది. ఆదిత్య L1 మిషన్ ప్రయోగం అనంతరం 125 రోజుల పాటు సుదీర్ఘంగా ప్రయాణించి సూర్యునికి దగ్గరలోని లాంగ్ రేంజ్ 1 కక్ష దగ్గరికి చేరుకుంటుంది.

near-the-sun-aditya-l1-experiment
near-the-sun-aditya-l1-experiment
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్