డబల్ బెడ్ రూమ్ కేటాయింపుల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం
సికింద్రాబాద్
పేద ప్రజల కోసం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ళ కేటాయింపులో గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి స్పష్టంగా కనిపిస్తోందని మల్కాజ్ గిరి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్ అన్నారు.. పేద ప్రజల ఇళ్ల స్థలాలను తీసుకుని కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన నిధులతో రెండు పడక గదుల ఇళ్లను అరకొరగా నిర్మించి లబ్ధిదారులకు అందించకుండా గత ప్రభుత్వం తాత్సారం చేసిందని ఆయన ఆరోపించారు. మల్కాజ్గిరి పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా మారేడుపల్లిలోని రెండు పడక గదుల ఇళ్లలో నివాసం ఉంటున్న ప్రజలతో అల్పాహార కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పేద ప్రజల కోసం కేంద్రం ద్వారా వచ్చినా నిధులను సైతం కదా రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేక చతికిలపడిందని అన్నారు. నిరుపేదల కోసం నిర్మించిన రెండు పడక గదుల ఇళ్ళల్లో తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఈటల రాజేందర్ కు తమ గోడును వెళ్ళబోసుకున్నారు. తాను గెలిచిన అనంతరం సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. త్వరలోనే కంటోన్మెంట్ ఉప ఎన్నికలకు సంబంధించి బిజెపి అభ్యర్థిని ప్రకటిస్తామని వెల్లడించారు..
డబల్ బెడ్ రూమ్ కేటాయింపుల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం
- Advertisement -
- Advertisement -