Sunday, September 8, 2024

మ్యుటేష‌న్ల‌తో భార‌త్‌లో కొత్త కోవిడ్ వేరియంట్లు

- Advertisement -

మ్యుటేష‌న్ల‌తో భార‌త్‌లో కొత్త కోవిడ్ వేరియంట్లు
న్యూఢిల్లీ మే 15
భార‌త్‌లో కొత్త కోవిడ్ వేరియంట్లు ప్ర‌బ‌లుతున్నాయి. మ్యుటేష‌న్ల‌తో ఆ వేరియంట్లు వ్యాపిస్తున్నాయి. వాటిని సంయుక్తంగా ఫ్లిర్ట్ అని పిలుస్తున్నారు. ఓ మీడియా క‌థ‌నం ప్ర‌కారం ఇటీల అమెరికా కోవిడ్ కేసుల సంఖ్య పెర‌గ‌డానికి ఆ ఫ్లిర్ట్ వేరియంట్లే కార‌ణ‌మ‌ని తెలుస్తోంది. కొత్త వేరియంట్ల‌లో కేపీ.2, కేపీ1.1, ఎఫ్ఎల్ఐఆర్‌టీ ఉన్నాయి. మ్యుటేష‌న్ల నుంచి వ‌చ్చిన ప‌దాల‌తో ఈ వేరియంట్ల‌కు నామ‌క‌ర‌ణం చేశారు. జేఎన్.1 వేరియంట్ నుంచి ఈ కొత్త వేరియంట్ల మ్యుటేష‌న్ అయిన‌ట్లు తెలుస్తోంది.కేపీ.2 వేరియంట్ ఏంటో తెలుసుకుందాం. ఇది ఒమిక్రాన్ జేఎన్.1 వేరియంట్ నుంచే పుట్టింది. ఇక జేఎన్.1 కేసుల సంఖ్య‌ను ఈ కొత్త వైర‌స్‌ దాటేస్తున్న‌ది. అమెరికా, కెన‌డా దేశాల్లో కేపీ.2 వేరియంట్ కేసుల సంఖ్య పెరుగుతున్న‌ది. ఫ్లిర్ట్ కేసులు కూడా అమెరికాలో శ‌ర‌వేగంగా వ్యాపిస్తున్నాయి. వీటినే ఇండియాలో కూడా డిటెక్ట్ చేశారు. మ‌హారాష్ట్ర‌లోనే కేపీ.2కు చెందిన 91 కొత్త కేసుల‌ను గుర్తించారు. క‌ర్నాట‌క‌లో కూడా ఈ కేసుల వ‌ల్ల ఆందోళ‌న చెందుతున్న‌ట్లు తెలుస్తోంది.ఏప్రిల్ నెల‌లో ఈ వేరియంట్ చాలా డామినాంట్‌గా ఉన్న‌ది. జ‌న‌వ‌రిలో తొలిసారి ఈ కేసుకు చెందిన ఆన‌వాళ్లు గుర్తించారు. థానే, సోలాపూర్, పూణె, అమ‌రావ‌తి, నాసిక్‌, అహ్మ‌ద్‌న‌గ‌ర్‌, ఔరంగ‌బాద్‌, లాతూర్‌, సంఘ్‌లియోన్ ప‌ట్ట‌ణాల్లో ఈ కేసుల‌ను ప‌సిక‌ట్టారు. ఎస్ ప్రోటీన్‌లో మూడు స‌బ్‌స్టిట్యూష‌న్స్ ఉండ‌డం వ‌ల్ల‌.. కేపీ.2 వేరియంట్‌.. జేఎన్.1 నుంచి వ‌చ్చిన‌ట్లు నిర్ధార‌ణ అవుతున్న‌ది. కోవిడ్ కేసుల్లో కేపీ.1 వ‌ల్ల 28 శాతం కేసులు న‌మోదు అవుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇక కేపీ.1.1 వేరియంట్ వ‌ల్ల కేవ‌లం 7.1 శాతం కేసులు మాత్ర‌మే న‌మోదు అవుతున్నాయి.ఇమ్యూనిటీ నుంచి త‌ప్పించుకోవ‌డంలో జేఎన్.1తో పోలిస్తే కేపీ.2 ముందంజ‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. దాని వ‌ల్లే ఈ వేరియంట్ తో ఎక్కువ ఇన్ఫెక్ష‌న్ జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ల‌కు కూడా కేపీ.2 వేరియంట్ సోకే ప్ర‌మాదం ఉంద‌ని కొలంబియా యూనివ‌ర్సిటీ వైరాల‌జిస్ట్ డాక్ట‌ర్ డేవిడ్ హో తెలిపారు.ఫ్లిర్ట్ వేరియంట్ వ‌ల్ల‌.. గొంతు నొప్పి, ద‌గ్గు, జ్వ‌రం, ముక్కు కార‌డం, త‌ల‌-ఒళ్లునొప్పులు, ఛాతి ప‌ట్టేయ‌డం, శ్వాస‌స‌రిగా తీసుకోలేక‌పోవ‌డం లాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్