పెద్ది’ మూవీలో నేటి నుంచి 5 నిమిషాల 56 సెకన్ల కొత్త సన్నివేశాలు

- Advertisement -

పెద్ది’ మూవీలో నేటి నుంచి 5 నిమిషాల 56 సెకన్ల కొత్త సన్నివేశాలు
New scenes lasting 5 minutes and 56 seconds in the movie ‘Peddi’ from today.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సెన్సేషనల్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించి విజయవంతంగా రన్ అవుతోంది. రెండు వారాలుగా థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తూ పలు రికార్డులను తిరగరాస్తున్న ఈ చిత్రం, ఇప్పుడు మూడో వారంలోకి మరింత బలంగా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం సినిమాకు కొత్త సన్నివేశాలను జోడిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. నేటి నుంచి ప్రేక్షకులు అదనంగా 5 నిమిషాల 56 సెకన్ల నిడివి గల కొత్త ఫుటేజ్‌ను థియేటర్లలో చూడబోతున్నారు. కొత్త సన్నివేశాలు రిపీట్ ఆడియన్స్ మరింత అలరించనున్నాయి.
అంతేకాకుండా, ఈ చిత్రం గురువారం నుంచి రెగ్యులర్ టికెట్ ధరలతో అందుబాటులోకి రానుంది. టికెట్ ధరల తగ్గింపు ఫ్యామిలీ ఆడియన్స్ ను మరింతగా ఆకర్షించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
అద్భుతమైన మౌత్ పబ్లిసిటీ, రికార్డు స్థాయి వసూళ్లు, అన్ని ప్రాంతాల్లోనూ కొనసాగుతున్న అద్భుతమైన ప్రదర్శనతో ‘పెద్ది’ ఇప్పటికే 2026లో అతిపెద్ద దక్షిణాది బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు కొత్త సన్నివేశాల జోడింపు, సాధారణ టికెట్ ధరలతో ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తన విజయయాత్రను మరింత కాలం కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
బుచ్చిబాబు సానా దర్శకత్వంలో వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మించిన ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పించాయి. అలాగే, రామ్ చరణ్ సోలో హీరోగా అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ‘పెద్ది’ కొత్త చరిత్ర సృష్టించింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular