Friday, January 17, 2025

కమలానికి కొత్త ఏడాది కొత్త అధ్యక్షుడు

- Advertisement -

కమలానికి కొత్త ఏడాది కొత్త అధ్యక్షుడు

New year new president for BJP

హైదరాబాద్, డిసెంబర్ 19, (వాయిస్ టుడే)
తెలంగాణ రాష్ట్ర బీజేపీకి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై పార్టీ వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. పార్టీ జాతీయ నాయకత్వం.. సంక్రాంతి కల్లా రాష్ట్రానికి అధ్యక్షుడిని నియమించనున్నట్లు తెలుస్తోంది. అయితే అంతర్గత చర్చల్లో రోజుకో సీనియర్‌ నేత పేరు తెరపైకి వస్తున్నా.. ఎంపీగా ఉన్న బీసీ నేతకు ఎక్కువ అవకాశాలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ సమీకరణాలు మారితే మాత్రం అనూహ్యంగా కొత్త నేతకూ అవకాశం దక్కవచ్చని పార్టీ వర్గాలు అంటున్నాయి.తెలంగాణలో ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ జాతీయ నాయకత్వం మదిలో ఏముందో రాష్ట్రంలోని కీలక నేతలకు సైతం అంతు చిక్కడంలేదు. అధికార పీఠమే అంతిమ లక్ష్యమని, ఇందుకోసం అనుసరించే వ్యూహంలో వేసే ఎత్తుగడలు మాత్రం అనూహ్యంగా ఉండబోతున్నాయని బీజేపీ ముఖ్యనేత ఒకరు తెలిపారు. పార్టీలో కొంతమంది సీనియర్‌ నేతల మధ్య అంతర్గత విభేదాలున్నాయి. పాత, కొత్త నేతల పంచాయతీలతో రాష్ట్ర పార్టీ వ్యవహారాలు నాలుగు స్తంభాలాటగా మారాయన్న విషయం అధినాయకత్వం దృష్టికి కూడా వెళ్లిందంట. తాము అధికారంలోకి రావాలంటే ముందు పార్టీలో సమన్వయం అవసరమని భావిస్తున్న పార్టీ పెద్దలు.. ఆ దిశగా కొత్త అధ్యక్షుడికి బాధ్యతలు కట్టబెట్టాలని భావిస్తున్నారంట.అన్ని సవాళ్లను ఎదుర్కొని పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగే నేతకే ఢిల్లీ పెద్దలు పట్టం కట్టబోతోతున్నారంట.. పోరాట పటిమ, సమన్వయం చేసుకునే సమర్థతతోపాటు వయసును కూడా ప్రామాణికంగా తీసుకునే అవకాశం ఎక్కువగా ఉందంటున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు పలువురు సీనియర్‌ నేతల నుంచి అభిప్రాయాలు తీసుకున్న పార్టీ అధిష్ఠానం.. తాజాగా మరోసారి కొంతమంది ముఖ్యుల నుంచి అభిప్రాయాలు తీసుకుందని పార్టీవర్గాలు వెల్లడించాయి.మరోవైపు సంస్థాగత ఎన్నికలకు సంబంధించి బీజేపీ ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేసింది. గత నెల 25 నుంచి ఈ ప్రక్రియను మొదలు పెట్టింది. కాగా ఈనెల 15 లోపు బూత్ కమిటీ ఎన్నికలు పూర్తి చేయాలని చూస్తోంది. అందుకు పార్టీ హైకమాండ్ ఇప్పటికే దిశానిర్దేశం చేసింది. 15 నుంచి 20 వరకు మండల కమిటీలు కంప్లీట్ చేయాలని చూస్తోంది. ఈ ప్రక్రియ అనంతరం రాష్ట్ర అధ్యక్ష ఎన్నికకు వెళ్లేందుకు నాయకత్వం సిద్ధం అవుతోంది. ఇప్పటికే పార్టీ బూత్ ల వారీగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి వరుసగా వర్క్‌షాప్‌లు నిర్వహించింది. గ్రౌండ్ నుంచి పార్టీని స్ట్రాంగ్ చేయదాంతో పాటు,. సంస్థాగత ఎన్నికల నిర్వహణ, సభ్యత్వాలు, యాక్టివ్ మెంబర్ షిప్ అంశాలపైనా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసింది.ఇక సంస్థాగత ఎన్నికల్లో భాగంగా ఇప్పటికే జాతీయ, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులను, జిల్లాల వారీగా ఇంచార్జీలను హైకమాండ్ నియమించింది. జాతీయ సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ను, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్‌ అధికారిగా మాజీ ఎమ్మెల్యే, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణను నియమించింది. వారు ఇప్పటికే సంస్థాగతంగా ఎన్నికలకు కసరత్తు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో పాటు జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారనే ఉత్కంఠ కాషాయ శ్రేణుల్లో నెలకొంది. స్టేట్ ప్రెసిడెంట్ కోసం చాలా మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు రేసులో ఉన్నారు. ఎంపీల్లో రఘునందన్ రావు, ధర్మపురి అరవింద్, ఈటల రాజేందర్, డీకే అరుణ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే ఎమ్మెల్యేల్లో రాజాసింగ్, పాయల్ శంకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం ఇప్పటికే కొంతమంది నేతలు పార్టీ హైకమాండ్ ఆశీస్సులు పొందాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.అయితే పార్టీ అధ్యక్షుడు ఎవరనే దానిపై అధిష్టానం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో హైకమాండ్ నిర్ణయానికి అనుగుణంగానే సంస్థాగత ఎన్నికలు జరిగుతున్నాయనే చర్చ ఆ పార్టీలో జరుగుతోంది. పార్టీ డిసైడ్ చేసిన నేతకే మద్దతు తెలిపి లాంఛనంగా ఎన్నుకుంటారనే టాక్ సైతం వినిపిస్తోంది. అధ్యక్షుడు ఎవరనే నిర్ణయం జరిగిపోవడంతో.. ఇక ఆ పేరు చుట్టూనే ఎన్నిక హడావుడి కొనసాగనుంది. అభ్యర్ధి ఈటల రాజేందరే అంటున్నారు. అయితే పార్టీ డిసైడ్ చేసింది ఎవరిని అనేది కాషాయశ్రేణుల్లో సస్పెన్స్‌గా మారిందంట.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్