నితిన్.. ‘ఎక్స్ ట్రా – ఆర్డినరీ మ్యాన్‌’

- Advertisement -

భారీ సెట్‌లో మాస్ సాంగ్ చిత్రీకరణ జరుపుకుంటోన్న నితిన్‌, వ‌క్కంతం వంశీ, శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య మూవీస్ అండ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ మూవీ

టాలెంటెడ్ యాక్ట‌ర్ నితిన్,  బ్యూటీ డాల్ శ్రీలీల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న ఔట్ అండ్ ఔట్ ఎంట‌ర్‌టైన‌ర్‌ ‘ఎక్స్‌ట్రా – ఆర్డిన‌రీ మ్యాన్’.  రైట‌ర్ – డైరెక్ట‌ర్ వ‌క్కంతం వంశీ ఈ సినిమాను తెర‌కెక్కిస్తున్నారు. ప్రస్తుతం శంషాబాద్‌లో వేసిన భారీ సెట్‌లో 300కి పైగా ఫారిన్ డాన్సర్స్‌తో జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో పక్కా మాస్ సాంగ్‌ను హీరో నితిన్, శ్రీలీలపై చిత్రీకరిస్తుండటం విశేషం. ఈ పాట చిత్రీకరణతో ఎంటైర్ షూటింగ్ పూర్తవుతుంది. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 8న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు.

Nitin.. 'Extra - Ordinary Man'
Nitin.. ‘Extra – Ordinary Man’

ఇప్పటికే ఈ సినిమా నుంచి ‘డేంజర్ పిల్ల…’, ‘బ్రష్ వేస్కో..’ సాంగ్స్ విడుదలై ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ను రాబట్టుకున్నాయి. అలాగే రీసెంట్‌గా విడుదలైన టీజర్‌ సైతం అమేజింగ్‌గా ఉందంటూ అప్రిషియేషన్స్ అందుకుంది.  మూవీలో యూనిక్‌గా ఉన్న నితిన్ క్యారక్టరైజేషన్, మూవీ కాన్సెప్ట్ అందరినీ ఆకట్టుకోనుంది. నితిన్ ఈ చిత్రంలో జూనియర్ ఆర్టిస్ట్ క్యారెక్టర్‌లో కనిపించి తనదైన కామెడీ టైమింగ్‌తో ఎంటర్‌టైన్ చేయించనున్నారు.

మ్యూజికల్ జీనియ‌స్ హేరిస్ జయ‌రాజ్ సంగీత సారథ్యం వహిస్తుండగా..యువరాజ్.జె, అర్థర్ ఎ.విలన్స్, సాయి శ్రీరామ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. శ్రేష్ఠ్ మూవీస్‌, ఆదిత్య‌మూవీస్ & ఎంట‌ర్ టైన్‌మెంట్స్, రుచిర ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ బ్యాన‌ర్స్‌పై ఎన్.సుధాక‌ర్ రెడ్డి, నికితా రెడ్డి ఈ మూవీని నిర్మిస్తున్నారు.

నటీనటులు: నితిన్, శ్రీలీల, డా.రాజశేఖర్, సుధేవ్ నాయర్, రావు రమేష్, రోహిణి, బ్రహ్మాజీ, అజయ్, హర్షవర్ధన్, అన్నపూర్ణమ్మ, పవిత్రా నరేష్, రవివర్మ, హైపర్ ఆది, వెంకటేష్ ముమ్ముడి, జగదీష్ తదితరులు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular