Sunday, September 8, 2024

పోటీ చేసేందుకే ధైర్యం లేదు

- Advertisement -

కరీంనగర్, అక్టోబరు 18, (వాయిస్ టుడే):  కమలాకర్ అన్నపై పోటీ చేసేందుకు అందరూ జంకుతున్నారని మంత్రి అన్నారు. కాంగ్రెస్ వాళ్లు హుస్నాబాద్ పారిపోయారు.. బీజేపీ వాళ్ళు పోటీకి వెన్క ముందాడుతున్నారంటూ మంత్రి తెలిపారు. గంగుల మీద పోటీ అంటే పోచమ్మ గుడి ముందు పొట్టేలు కట్టేసినట్టే అంటూ కేటీఆర్ అన్నారు. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ మంత్రి మంత్రి మాట్లాడుతూ.. మరోసారి తెలంగాణలో కేసీఆర్ కి అవకాశం ఇవ్వాలని కోరారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఈ పదేళ్ళలో ఎన్ని మార్పులు వచ్చాయన్నారు. మానేరు నీళ్లకోసం జరిగిన కొట్లాటలు ఇంక కళ్లముందే ఉన్నాయని తెలిపారు. నేడు ఆ పరిస్థితి మారింది..కాళేశ్వరంతో కరీంనగర్ జిల్లా అంత సజీవ జలధారగా మారిందన్నారు. అభివృద్ధికి తోడు సంక్షేమం దీటుగా సాగుతుందని తెలిపారు. కమలాకర్ నాయకత్వంలో బీసీ సంక్షేమం అద్భుతమైన ప్రగతి సాధించామన్నారు.

చదువుకునేందుకు గురుకులాలు, విదేశాలకు పోయేవాళ్ళకి కూడా అండగా ఉన్నామన్నారు. హిందూ ముస్లింల మధ్య కొట్లాటలు పెట్టె సన్నాసులు కరీంనగర్ లో ఉన్నారని తెలిపారు. కమలాకర్ చేతిలో చావు దెబ్బ తిని దొంగ ఏడ్పుతో ఎంపీ అయ్యాడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఎంపీ అయ్యాక కరీంనగర్ కి ఏం చేశారు? ఓ బడి తేలేదు… కనీసం గుడి అయినా తేలేదు.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.మోడీ దేవుడన్న అంటున్న బండి సంజయ్ చెప్పాలి గ్యాస్ ధర ఎంత పెరిగిందో? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ అందరి నాయకుడు.. హిందూ ముస్లిం అందరికి నేత అన్నారు. కేసీఆర్ గొప్ప హిందువు… యాగాలు యజ్ఞాలు చేశారని, నిజమైన హిందువు ఎవర్ని తిట్టడని అన్నారు. ఇక్కడ ఎంపీ మసీదులు తవ్వుదాం అంటాడు… బొందల గడ్డలు తవ్వడానికా ఎంపీ అయింది సంజయ్ అంటూ మండిపడ్డారు. పునాదులు తవ్వండి.. అభివృద్ధి కోసం పునాదులు వేయండని అన్నారు. చావు నోట్లో తలపెట్టిన కేసీఆర్ ఒకవైపు… తెలంగాణ కోసం రాజీనామా చేయకుండా పారిపోయిన బీజేపీ కిషన్ రెడ్డి, ఓటుకు నోటు దొంగ థర్డ్ క్లాస్ క్రిమినల్ రేవంత్ రెడ్డి ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ బీమా పథకం తెస్తున్నాం.. అధికారం ఇవ్వండి.. ఆర్నెళ్లలో అమలు చేస్తామన్నారు. కమలాకర్, కేసీఆర్ కి చెప్పినట్టు… రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేయబోతున్నామన్నారు. 15 లక్షల పరిమితితో కేసీఆర్ ఆరోగ్య రక్ష ఇస్తామన్నారు.

No courage to compete
No courage to compete

ప్రవళిక అనే అమ్మాయి చనిపోతే కొందరు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. వారి కుటుంభం నా దగ్గరకు వచ్చారు.. వారి అమ్మాయిని వేధించారని చెప్పారని తెలిపారు. వారికి న్యాయం చేస్తాం.. ఆ అమ్మాయి తమ్మునికి ఉద్యోగం ఇస్తామని చెప్పామని మంత్రి క్లారిటీ ఇచ్చారు. రాహుల్ వస్తాడు.. ప్రియాంక వస్తుంది.. మోసపోకండి… కార్ గుర్తుకు ఓటేసి కేసీఆర్ ని దీవించండి అని మంత్రి కేటీఆర్ అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్