Sunday, September 8, 2024

బిఆర్ఎస్ చేసిన అభివృద్ధి ఏమీ లేదు: గూడూరు నారాయణరెడ్డి

- Advertisement -

అసమర్ధ ఎమ్మెల్యేతో అన్ని సమస్యలే

భువనగిరి బిజెపి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి

భువనగిరి,నవంబర్ 23:   తొమ్మిదిన్నర సంవత్సరాలలో  బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమి లేదని గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా సమస్యలు దర్శనమిస్తున్నాయని భువనగిరి బిజెపి అభ్యర్థి గూడూరు నారాయణరెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు వలిగొండ మండలం సంగెం, వర్కట్ పల్లి, గోకారం,నాగారం , నెమలి కాల్వ , జాలు కాల్వ , గొల్నే పల్లి గ్రామాలలో ఇంటింటి ప్రచారంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వందల కోట్లతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి కి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో నెలకొన్ని ఉన్న సమస్యలు కనబడలేదా అర్థం కాలేదా అని ఆయన ప్రశ్నించారు. ఉద్యోగ ఉపాధి కల్పనలో బిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్రంలో నిరుద్యోగ యువతను నిలువెత్తున మోసం చేసిందని యువత తిరుగుబాటుతోనే  బిఆర్ఎస్ ప్రభుత్వం పతనమై బిజెపి ప్రభుత్వం రాబోతుందని ఆయన అన్నారు.బిజెపి కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యే గా గెలిపించ వలసిందిగా కోరడం జరిగింది.ఈ సందర్భంగా నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ  మూసి నది నీటి వలన నీరు విషతుల్యం అయి  నెలలు కూడా కాలుష్య అయి రైతులు, పరివాహక గ్రామల ప్రజలు తీవ్ర అనారోగ్యం సమస్యలకు గురి అవుతున్నారు, తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే ఈ మూసి నది ప్రక్షాళన చేస్తానని, సంగెం, రుద్రెల్లీ, ఇంద్రియాల బ్రిడ్జి లను కట్టిస్తాననీ, వలిగొండ మండలాన్ని హెచ్ ఎం డి ఎ పరిధిలోకి తెచ్చి అభివృద్ధి చేస్తానని చెప్పారు. అంతే కాకుండా హైదరాబాద్ లోని గచ్చిబౌలి పరిసర ప్రాంతాలలో 30 లక్షల మంది ఐటీ ఉద్యోగులు పని చేస్తున్నారని, హైదరాబాద్ నుండి గచ్చిబౌలి, కొండాపుర్ ఎంత దూరంలో ఉన్నాయో మరి హైదరాబాద్ నుండి భువనగిరి కూడా అంతే దూరం లో వున్నప్పటికి ఇక్కడ ఐ టీ పరిశ్రమలు స్థాపించక పోవడం ప్రస్తుత ఎమ్మెల్యే శేకర్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం, తనకు ఒక్క అవకాశం కల్పించి ఎమ్మెల్యే గా గెలిపిస్తే భువనగిరిలో ఆ 30 లక్షలలో కనీసం ఒక్క శాతం అంటే 30 వేల మంది కి ఐటీ ఉద్యోగాల కల్పనకి ఐటీ హబ్ ను నెలకొల్పుతానని తద్వారా పరోక్షంగా 60 వేల మంది కి ఉపాధి దొరుకుతుందని ప్రస్తుతం పరిపాలిస్తున్న పాలకులకు నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే స్పృహ లేకపోవడం దురదృష్టకరం.

తనను ఎమ్మెల్యే గా గెలిపిస్తే భువనగిరి నియోజకవర్గ కేంద్రంలో స్వంత నిధులతో  ఆధునాతన డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తానని,నియోజకవర్గంలోని ప్రతి మండలానికి రెండు బస్సులను గూడూరు నారాయణ రెడ్డి ఫౌండేషన్ ద్వారా ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో రవాణా సౌకర్యాన్ని మెరుగు పరుస్తానన్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసినా అది బి ఆర్ ఎస్ అకౌంట్ లొకే వెళ్తుందని, వాళ్ళు సంతలో పశువుల కన్నా ఘోరంగా అమ్ముడు పోతారని అన్నారు. అంతే కాకుండా బిజెపి పార్టీ ఎన్నికల మేనిఫెస్టో లో రైతులకు బరోసా కల్పిస్తూ రైతులకు వరి మద్దతు ధర 3100 రూపాయలు, ఎరువులు విత్తనాల కొనుగోలు కోసం రూ.2500 సహాయం,అర్హత గల కుటుంబాలకు 10లక్షల ఉచిత ఆరోగ్య బీమా, పెట్రోల్ డీజిల్ పై వ్యాట్ తగ్గింపు,మహిళలకు ఒక శాతానికి వడ్డీ రుణాలు, ప్రతి ఆరు నెలల ఒకసారి టీఎస్పిఎస్సీ ద్వారా ఉద్యోగాల నోటిఫికేషన్లు,అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డులు పంపిణీ, అర్హులైన వారికి ఇండ్ల స్థలాలు మరియు ఇళ్లను కట్టిస్తామని చెప్పారు.ఆడబిడ్డ బరోసా కింద 21ఏళ్ల వచ్చే సరికి 2  లక్షల రూపాయల పథకాలతో పాటు ఉజ్వల లబ్ది దారులకు ఉచితంగా 4 గ్యాస్ సిలిండర్లు, రాష్ట్ర ప్రభుత్వ అవినీతి పై విచారణకు కమిషన్ ఏర్పాటు, కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖ, ధరణి స్థానంలో మీ భూమి యాప్, బిసి ని ముఖ్యమంత్రి చేస్తామని, ఎస్సి వర్గీకరణ కు  సానుకూలంగా స్పందించి కమిటీ ఏర్పాటు చేసి న్యాయం చేస్తామని చెప్పడం జరిగిందనీ అన్నారు.తనను గెలిపిస్తే భువనగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో బి జె పి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు ఏలే చంద్రశేఖర్, మండల పార్టీ అధ్యక్షులు సుధాకర్ గౌడ్ ,మల్లేష్, రమేష్, దానయ్య, రాము, అభి తేజ్ రెడ్డి, శ్రీశైలం, తనిష, నర్సింహ ఇస్తారి, నరేష్ జంగయ్య, మహేందర్, సుమన్ రెడ్డి, శ్రీను, వీరేశ్, శ్రీనివాస్ , శ్రీనివాస్ చారి, లింగ స్వామి, కుమార్, ఈశ్వరయ్య, స్వామి, యాది రెడ్డి, సత్తయ్య మరియు ఆయా గ్రామాల అధ్యక్షులు ,బూత్ అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్