రెవెన్యూ సదస్సుల నాడు అందే ఆర్జీలకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు
No fee is required for submission of RGs on revenue conferences
రెవెన్యూ సదస్సులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి:
డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్
గత ప్రభుత్వ హయాంలో నియోజక వర్గంలో జరిగిన భూ ఆక్రమనల వలనే పలు భూ సమస్యలు::
ఎంఎల్ఏ నెల వల విజయశ్రీ
నాయుడు పేట,
దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న భూ, రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారం కొరకు డిసెంబర్ 6 నుండి జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, గ్రామాలలో ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎంఎల్ఏ నెల వల విజయశ్రీ సంయుక్తంగా పేర్కొన్నారు.
శుక్రవారం మధ్యాహ్నం సూళ్లూరుపేట నియోజకవర్గం స్థానిక నాయుడుపేట విన్నమాల గ్రామం నందు ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సు నందు సూళ్లూరుపేట ఎంఎల్ఏ నెలవల విజయశ్రీ, ఎమ్మెల్యే ఆర్డీఓ కిరణ్మయి, తదితర సంబంధిత అధికారులతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో ఈనెల 6వతేదీ నుండి వచ్చే నెల జనవరి 8వ తేదీ వరకూ 33 రోజులు రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామని, మనం గమనిస్తే గౌ. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రులు పీజీ ఆర్ ఎస్ నిర్వహణలో, అలాగే కలెక్టర్ నిర్వహించే పీజిఆర్ఎస్ ఫిర్యాదులు అన్నిటినీ పరిశీలిస్తే సుమారు 70 శాతం రెవెన్యూ సమస్యలు ఉన్నాయని ముఖ్యమంత్రి వాటి పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టారు అని, సక్రమంగా నిర్వహించి సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి చేసినతొలి 5 సంతకాలలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగిందని తద్వారా రీసర్వే, ఫ్రీ హోల్డ్ చేసిన భూముల అవకతవకలపై పరిష్కారం కొరకు రెవెన్యూ సదస్సులకు శ్రీకారం చుట్టడం జరిగింది అని తెలిపారు. ఇది కూటమి ప్రభుత్వ నిబద్ధతకు నిదర్శనం అని తెలిపారు. రెవెన్యూ సంబంధిత భూ సమస్యల పరిష్కారం ద్వారా గ్రామాల్లో తగాదాలు తగ్గిపోయి శాంతి భద్రతలు కూడా మెరుగు పడతాయని అన్నారు. గ్రామాలలోని ప్రజలకు సంబంధించిన భూ సంబంధిత మరియు ఇతర రెవెన్యూ సంబంధిత సమస్యలపై రెవెన్యూ సదస్సులలో అర్జీలు వస్తున్నాయని, వాటి పరిష్కారం కొరకే ఈ రెవెన్యూ సదస్సులు నిర్వహణ అని, రెవెన్యూ యంత్రాంగం ప్రజల ముంగిటకు వచ్చి వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతోందని,ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఆర్డీవో, తహశీల్దార్ తదితర రెవెన్యూ అధికారులు గ్రామంలోని ప్రజలకు సంబంధించిన రెవెన్యూ సంబంధిత, భూములకు సంబంధించిన, కుల ధ్రువీకరణ, ఆదాయ ధ్రువీకరణ, సర్వే, మ్యుటేషన్ తదితర సమస్యలు ఉంటే వారి గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించిన రోజు అర్జీలు స్వీకరించి పరిష్కారం అప్పటికప్పుడే పరిష్కారం ఐతే పరిష్కారం చూపాలని, లేని పక్షంలో 45 రోజులలో నిర్దేశిత గడువులోపు పరిష్కరించాలని తెలిపారు. ఫ్రీ హోల్డ్ మరియు సెక్షన్ 22A తదితర రెవెన్యూ సమస్యలను పరిష్కరించే దిశలో రెవెన్యూ అధికార యంత్రాంగం పరిష్కార దిశగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ రెవెన్యూ సదస్సుల వేదిక రెవెన్యూ సంబంధిత సమస్యలు పరిష్కారానికి చక్కగా ఉపయోగ పడుతుందని, తహసీల్దార్, రెవెన్యూఇన్స్పెక్టర్, సంబంధిత గ్రామాల వి.ఆర్.ఓ,మండల సర్వేయర్, రిజిస్ట్రేషన్ శాఖ ప్రతినిధి,అవసరమైన చోట్ల అటవీ,దేవాదాయ శాఖ,వక్ఫ్ బోర్డు సిబ్బందితో కూడిన ఈ అధికార బృందాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయని తెలిపారు. రెవెన్యూ సదస్సు నిర్వహించే రోజున వచ్చే అర్జీలకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని ఉదాహరణకు సర్వే, అడంగల్, 1-B రికార్డు, కుల ధ్రువీకరణ పత్రం, ఆదాయ ధ్రువీకరణ పత్రం, మ్యుటేషన్, పేరు సవరణ తదితర పత్రాలకు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదని, ఆ రోజు మినహా మిగిలిన రోజులలో వచ్చే అర్జీలకు నిర్దేశిత రుసుములు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. రెవెన్యూ సదస్సుల సందర్భంగా స్వీకరించే ఫిర్యాదులన్నిటినీ రియల్ టైమ్ గవర్నెస్ సొసైటీ(RTGS) రూపొందించిన గ్రీవెన్స్ రిడ్రెసల్ పోర్టల్లోని ప్రత్యేక విండోలో ఆన్‌లైన్లో నమోదు చేయడం జరుగుతుందని, రసీదు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సులలో అర్జీలు రాయడానికి రాని వారి కొరకు ప్రత్యేకంగా అర్జీలు రాసేందుకు ఏర్పాటు చేసామని అన్నారు. సదరు సదస్సులలో రెవెన్యూ అంశాలే కాకుండా ఏవైనా ఇతర సమస్యల అర్జీలు వస్తే వాటిని కూడా స్వీకరించాలని అధికారులకు సూచించారు. సదస్సులో అందిన ఫిర్యాదులు 45 రోజుల లోపల పరిష్కరించడం జరుగుతుందని, జనవరి నెలలో సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, కొత్త పెన్షన్ల ప్రక్రియ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు చేపడతామని తెలిపారు. ల్యాండ్ గ్రాబింగ్ భూ ఆక్రమణలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు ఉంటాయని తెలిపారు. ఎమ్మెల్యే కోరిన మేరకు హైవే నుండి అప్పల పాలెం వరకు 3.30 కిలోమీటర్ల రోడ్డు ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని అలాగే స్మశాన వాటికకు స్థలం కోరడమేరకు మూడు రోజుల్లో చర్యలు తీసుకుంటామని గిరిజన కాలనీలో ప్రతి ఇంటికి ఒక ట్యాప్ కనెక్షన్ ఇవ్వడానికే వారంలోపు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫేషియల్ అండర్ పాస్ పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఎంఎల్ఏ నెలవల విజయ శ్రీ మాట్లాడుతూ రెవెన్యూ సమస్యల పరిష్కారం కొరకే రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, తమకు ఏమైనా రెవెన్యూ భూ సంబంధిత సమస్యలు ఉంటే అర్జీలు ఇవ్వాలని, పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని, తను అండగా ఉంటానని అన్నారు. గత ప్రభుత్వంలో చుక్కల భూములు, పట్టాల పంపిణీ లలో పలు అవకతవకలు జరిగాయని, బాధితులు సదరు అంశాలపై ఏవైనా ఫిర్యాదులు ఉంటే అధికారులు దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గత ప్రభుత్వ హయాంలో మండలంలో భూ కబ్జాలు, అక్రమాలు జరిగాయని, పలు అంశాలు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చి చర్యలు తీసుకోవాలని కోరారు. స్మశాన వాటికకు స్థలము కేటాయించడానికి మరియు విన్నమాల కు రోడ్డు మంజూరు చేయడానికి సానుకూలంగా స్పందించిన జిల్లా కలెక్టర్కు కృతజ్ఞతలు తెలిపారు.
అనంతరం ప్రజల నుండి కలెక్టర్, ఎంఎల్ఏ, సంబంధిత అధికారులు అర్జీలు స్వీకరించారు.
ఈ సమావేశంలో తాసిల్దార్ రాజేంద్ర, ఎంపీడీవో తదితర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.