వరద నష్ట పరిహారం అందలేదు
No flood compensation receivedగత నెల మొదటి వారంలో వచ్చిన వరదలకు కృష్ణా, మున్నేరు పరివాహక గ్రామాల ప్రజలు వరద సహాయం ప్రభుత్వం అందజేయ నందుకు నిరసనగా కంచికచర్ల మండల తాసిల్దార్ కార్యాలయం కి జడ్పిటిసి వేల్పుల ప్రశాంతి ఆధ్వర్యంలో మెమోరాండం అందజేసారు ….
గత నెల మొదటి వారంలో కృష్ణా, మునేరు పరివాహక ప్రాంతాలలో ఉన్న 9 గ్రామాల ప్రజలకు వరద ముంపుకు గురైనప్పటికీ ఎటువంటి ఆర్థిక సహాయం అందజేయలేదు. వీరు తమ ఇల్లు 100% మునిగాయని ప్రభుత్వ దృష్టికి తీసుకురాగా ఎన్యుమరేషన్ చేస్తున్నట్లు అధికారులు ప్రకటిస్తున్నప్పటికీ ఇంతవరకు జాబితా తయారు కాలేదు.
జాబితా తయారు చేయడం అతి తేలిక అయినప్పటికీ కంచికచర్ల మండల రెవెన్యూ అధికారి అలసత్వం మిగతాధికారుల పనితీరు అద్వానంగా ఉండటంతో ఇంతవరకు వరద వలన నీట మునిగిన ఇళ్ల నష్ట పరిహారం రాలేదని అన్నారు.
దీంతో ఈ 9 గ్రామాలలో వరద ముంపుకు గురైన ఇళ్లకు నష్టపరిహారం అందలేదు. ఈ గ్రామాల బాధితులు అధికారులకు హెచ్చరిక చేసినప్పటికీ వారు పట్టించుకోలేదు.
కంచికచర్ల మండలంలో గల తొమ్మిది గ్రామాలలో 100% ఇల్లు మునిగినప్పటికీ జాబితా తయారు చేయడంలో అధికారులు వైఫల్యం చెందారు.
దీంతో ఆగ్రహించిన ఆ ఆ గ్రామాల ప్రజలు నేడు కంచికచర్ల తాహసిల్దార్ కార్యాలయం జెడ్పిటిసి వేల్పుల ప్రశాంతి ఆధ్వర్యంలో మెమొరాండం అందజేశారు.
గత్యంతరం లేని పరిస్థితులు ఈ కార్యక్రమం చేపట్టినట్లు బాధితుల తో పాటు పలు గ్రామాల ప్రజా ప్రతినిధులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
వరద ముంపుకు గురైన గృహాలకు నష్టపరిహారం చెల్లించకపోతే ఈ గ్రామాల ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమానికి సిద్ధమవుతున్నామని ఆ ఆ గ్రామాల ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో వేల్పుల రమేష్, ముప్పాళ్ళ శివాజీ, బొక్క రవికుమార్ గండేపల్లి సర్పంచ్ ,రాయల నరసింహారావు, ప్రత్తిపాటి కృష్ణమూర్తి, నల్లపు శ్రీనివాసరావు, బంక విశ్రాంతమ్మ, మాడుగుల ఆంజనేయులు, పురుషోత్తం మరియు మండల పరిధిలోని 9 గ్రామాల వరద బాధితులు పాల్గొన్నారు




