- Advertisement -
“జూద క్రీడలు వద్దు, సాంప్రదాయ క్రీడలు ముద్దు”
No sports gambling,traditional sports are good
సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా పోలీసు ఆధ్వర్యంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో యువతకు ఆటల పోటీల నిర్వహణ
యువత జూద క్రీడలు వంటి చెడు వ్యసనాలకు లోను కాకుండా, శారీరిక శ్రమను పెంచే సాంప్రదాయ క్రీడల్లో పాల్గొనాలి.
తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ డి. నరసింహ కిషోర్
సంక్రాంతి పండుగ సందర్భంగా యువత జూద క్రీడల వైపు మొగ్గు చూపకుండా, సాంప్రదాయ క్రీడలలో పాల్గొనే లా తూర్పుగోదావరి జిల్లా పోలీసువారి ఆధ్వర్యంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో యువతకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… ముఖ్యంగా యువత జూద క్రీడలకు దూరంగా ఉండాలి అని, జూద క్రీడల్లో పాల్గొంటే చట్ట ప్రకారం క్రిమినల్ చర్యలు తీసుకుంటాచిక్కుకుంటే వారికి భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలను కోల్పోతారని సంక్రాంతి పండగ నేపథ్యంలో సాంప్రదాయ క్రీడలకు మొగ్గు చూపాలని, కుటుంబ సభ్యులతో ఆనందంగా సంక్రాంతి పండుగ గడుపుకోవాలని, సమాజంలో మంచి పేరు సంపాదించుకొని ఉన్నత స్థానంలో ఉండాలని హితవు పలికినారు.
- Advertisement -