అశేష జన సంద్రోహం నడుమవైకాపా అభ్యర్దుల నామినేషన్
నందికొట్కూరు
బుధవారం నాడు నందికొట్కూరు బ్రహ్మంగారి మఠం నుండి భారీ జన సందోహం మధ్య ర్యాలీగా పాత బస్టాండ్ పటేల్ సెంటర్ వరకు వైకాపా భారీ ర్యాలీ కొనసాగింది. శాప్ చైర్మన్ బైరెడ్డి.సిద్ధార్థ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి దార సుధీర్ ఇతర నేతలు ర్యాలీలో పాల్గోన్నారు. తరువాత అభ్యర్దులు నామినేషన్ దాఖలు చేసారు.
సిద్దార్ద్ రెడ్డి మాట్లాడుతూ మాట్లాడుతూ నామినేషన్ కార్యక్రమానికి ఇంత భారీగా జన సందోహం తరలివచ్చినందుకు వైసిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులకు ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. మరి ముఖ్యంగా రాబోయే రోజులు చాలా కీలకమైనవి ప్రతి ఒక్క నాయకుడు గ్రామాలలో జగనన్న చేసిన అభివృద్ధి. సంక్షేమ పథకాలు వివరిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేయాలని తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని నాయకులు కోరారు. నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజా ప్రతినిధులు మండల స్థాయి నాయకులు.కార్యకర్తలు, అభిమానులకు నా హృదయపూర్వక ధన్యవాదాలని అన్నారు.
అశేష జన సంద్రోహం నడుమవైకాపా అభ్యర్దుల నామినేషన్
- Advertisement -
- Advertisement -