బీహార్ లో పట్టాలు  తప్పిన  నార్త్ ఈస్ట్ సూపర్ ఎక్స్ ప్రెస్ రైలు

- Advertisement -

బీహార్ :అక్టోబర్ 12:  బీహార్‌లోని బక్సర్ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. బీహార్‌లోని బక్సర్ జిల్లాలోని రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ సమీపంలో బుధవారం రాత్రి భారీ రైలు ప్రమాదం సంభవించింది.

అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఢిల్లీ నుంచి వస్తున్న 12506 ఆనంద్ విహార్ కామాఖ్య నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 12506లోని ఐదు కోచ్‌లు బక్సర్ జిల్లా సమీపంలో పట్టాలు తప్పాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది.

ఆనంద్ విహార్ టెర్మినల్ నుండి కామాఖ్య వరకు నడుస్తున్న రైలు నంబర్ 12506 నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని 5 కోచ్‌లు బుధవారం రాత్రి బీహార్‌లోని బక్సర్ సమీపంలో పట్టాలు తప్పాయి.

ఈ ప్రమాదంలో పలువురు గాయపడినట్లు సమాచారం. దానాపూర్ రైల్వే డివిజన్‌లోని రఘునాథ్‌పూర్ స్టేషన్ సమీపంలో 12506 నార్త్ ఈస్ట్ ఎక్స్‌ప్రెస్‌లోని కొన్ని కోచ్‌లు పట్టాలు తప్పాయని రైల్వే అధికారి తెలిపారు..

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular