- Advertisement -
రైతు భరోసా ఇవ్వడం లేదు
Not giving Raithu Bharosa
ముఖరా కె రైతుల నిరసన
ఆసిఫాబాద్
రాహుల్ గాంధీ, మేమేం పాపం చేసాం..మాకు రైతు భరోసా ముఖ్యమంత్రి వేస్తలేరు అంటూ రాహుల్ గాంధీ కి ముఖరా కె రైతులు సెల్ఫీ ద్వారా వీడియోలు పంపారు. ప్రతి రైతుకు రైతు భరోసా ఎకరానికి 15000 , ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 12000, మహా లక్ష్మి పథకం లో ప్రతి మహిళకు ప్రతి నెలకు 2500 రూపాయలు ప్రతి ఒక్కరికి వేస్తానని చెప్పి ఇప్పుడు మండలానికి ఒక గ్రామానికే రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారు, మేమేం పాపం చేసామంటూ పంట పొలాలో రభి పంటలో రైతులు నిలబడి, మీరు చెప్పిన విధంగా ప్రతి ఒక్కరికి రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, మహాలక్షి పథకంలో ప్రతి మహిళకు ప్రతి నెలకు వెయ్యాలని,మీరు వరంగల్ డిక్లరేషన్ లో ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేరుస్తలేడు, వాన కాలం రైతు భరోసా వేయలేదు, రభి పంట కూడా వేసాము ఇంకా రైతు భరోసా రాలేదు, అప్పులు చేసి రభి పంట వేసాము కనీసం ఇప్పుడైనా అందరికి రైతు భరోసా వేయాలని మీరు ఇచ్చిన హామీని నేరవెర్చాలని వ్యవసాయ క్షేత్రంలో దుఃఖంతో రైతులు నిలబడి సోసెల్ మీడియా ద్వారా రాహుల్ గాంధీకి రైతులు వీడియోలు పంపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్, విట్టల్, ప్రలాద్, దత్త, నాగనాథ్, తిరుపతి, తులసిరామ్, రైతులు పాల్గొన్నారు
- Advertisement -