Saturday, February 15, 2025

ప్రజా పాలన కాదు   బిత్తిరి పాలన

- Advertisement -

ప్రజా పాలన కాదు  బిత్తిరి పాలన

Not Public rule its Bittiri's rule

చెప్పేవాటికి   చేసేవాటికి పొంతన ఉండటం లేదు

ఆరు గ్యారంటీల పేరుతో జనాన్ని ఆగం చేస్తున్న కాంగ్రెస్ నాయకులు

వెంటనే ఆరు గ్యారంటీలు రాష్ట్రం అంతటా అమలు చేయాలని బిజెపి ధర్నా

కరీంనగర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి రాష్ట్రంలో 6 గ్యారంటీల అమలు పేరుతో సామాన్య జనాన్ని ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిప్పుకుంటూ ఆగం చేస్తుందని, రాష్ట్రంలోని అన్ని గ్రామాలలో అర్హులైన అందరికీ ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా కేవలం మండలానికి ఒక్క గ్రామంలోనే అమలు చేయడానికి నిరసిస్తూ  భారతీయ జనతా పార్టీ శంకరపట్నం మండల అధ్యక్షుడు ఏనుగుల అనిల్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మాడ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుండి 6 గ్యారంటీల అమలు పేరుతో ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తినిపించుకుంటూ ఆగం చేస్తుందని, వారు హామీ ఇచ్చిన ఏ ఒక్క గ్యారెంటీని సక్రమంగా అమలు చేయలేదని తద్వారా ప్రజలు అయోమయంతో పాటు ఆగమవుతున్నారని వెంటనే అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామంలో ఆరు గ్యారెంటీలకు సంబంధించిన పథకాలను అందించాలని లేనిపక్షంలో అన్ని గ్రామాల రైతులతో పాటు లబ్దిదారులతో ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. కాంగ్రెస్ నాయకులు అర్థం పర్థం లేకుండా చెప్పే వాటికి చేసే వాటికి పొంతన లేకుండా ప్రజలను మభ్యపెడుతున్నారని ఇటీవల ప్రకటించిన నాలుగు పథకాలకు సంబంధించి కాంగ్రెస్ రాబోయే ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఆడుతున్న రాజకీయ క్రీడ మాత్రమేనని గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు కార్యక్రమాన్ని ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో రైతులకు రెండు పంటల  పెట్టుబడి బాకీ పడిందని, ప్రస్తుతం మండలానికి ఒక గ్రామం అంటూ రాష్ట్రంలో 612 గ్రామాలకు మాత్రమే రైతు భరోసా నిధులు విడుదల చేయడం మిగతా 12157 గ్రామాలకు ఎగనామం పెట్టడం లో ఆధ్వర్యంలో ఏమిటని, ఇక ఇందిర ఇండ్ల విషయానికి వస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పథకాన్ని కొనసాగిస్తామని చెబుతున్న కాంగ్రెస్ పెద్దలు కేవలం వారి కాంగ్రెస్ నాయకులతో ఇందిరమ్మ కమిటీలు వేసి కాంగ్రెస్ కార్యకర్తలకు వారికి అనుకూలంగా ఉన్న వారికి మాత్రమే పథకాలను అందించే ప్రయత్నం చేస్తుందని, దీనిని బిజెపి తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దండు కొమురయ్య మాట్లాడుతూ సంక్షేమ పథకాలు రాష్ట్రమంతటా అమలు చేకపోవడంతో తన వైఫల్యాలపై ప్రజలు ఏడ తిరగబడతారో అని పద్మశ్రీ అవార్డుల విషయం తెరపైకి తెచ్చి రెచ్చగొడుతున్నారని, ఇటీవల మందకృష్ణ మాదిగ  పద్మశ్రీ అవార్డు ఇవ్వడాన్ని  జీర్ణించుకోలేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాలవర్గం మెప్పు పొందేందుకు మాత్రమే గద్దర్ పేరును ప్రస్తావిస్తూ రాజకీయం చేస్తున్నారని, మాల మాదిగల మధ్య వైశమ్యాలను పెంచేందుకు కాంగ్రెస్ నాయకులు కుటిల రాజకీయాలు చేస్తున్నారని వారి పేర్కొన్నారు. ఇప్పటికైనా రాష్ట్రమంతటా అన్ని గ్రామాలలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శిలు దాసరపు నరేందర్ కొయ్యడ అశోక్ యాదవ్ జిల్లా కార్యవర్గ సభ్యులు జంగ జైపాల్, నాయకులు దొంగల రాములు,  కోయడ కుమార్ యాదవ్, రాసమల్ల శ్రీనివాస్, బిజిలి సారయ్య, కొండల్ రెడ్డి, చుక్కల శ్రీకాంత్, నిమ్మశెట్టి సంపత్, గూళ్ళ రాజు, పోతునూరి రాజు, బొజ్జ సాయి ప్రకాష్, దాసరి సంపత్, మహిపాల్, సందీప్, సాయిలతో పాటు వివిధ గ్రామాల బిజెపి నాయకులతో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్