- Advertisement -
పాలకులం కాదు..సేవకులం
మునుగోడు
మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నాడు మునుగోడు మండల కేంద్రంలోని కమ్మగూడెం జీసస్ చర్చి లో నిర్వహించిన క్రిస్టమస్ వేడుకల్లో పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనలు చేసి కేక్ కటింగ్ చేసి శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవ మతస్తులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
కోమటిరెడ్డి మాట్లాడుతూ నేను శాసనసభ్యునిగాను మీ కుటుంబ సభ్యున్ని. మీకు ఏ సమస్య వచ్చినా 24 గంటలు నా ఇంటి తలుపులు తీసే ఉంటాయి. మేము పాలకులం కాదు సేవకులం ఇది మా ప్రభుత్వ నినాదమని అన్నారు.
- Advertisement -