‘గాంజా శంకర్‌’ చిత్ర యూనిట్‌కు నోటీసులు

- Advertisement -

సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న ‘గాంజా శంకర్‌’ చిత్ర యూనిట్‌కు తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో (టీఎస్‌ న్యాబ్‌) పోలీసులు నోటీసులు ఇచ్చారు. గంజాయి (గాంజా) పదాన్ని తొలగించాలని సూచించారు. సినిమాలో మాదక ద్రవ్యాలకు సంబంధించిన అభ్యంతరకర సన్నివేశాలుంటే ఎన్డీపీఎస్‌-1985 చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. విద్యార్థులు, యువతపై మూవీ టైటిల్‌ ప్రభావం చూపుతుందని.. గంజాయి సీన్స్‌, డైలాగులు లేకుండా చూడాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular