Sunday, September 8, 2024

తపాలా శాఖలో 44,228 కొలువులకు నోటిఫికేషన్

- Advertisement -

తపాలా శాఖలో 44,228 కొలువులకు నోటిఫికేషన్

Notification of 44,228 measures in the Department of Posts

తెలుగు రాష్ట్రాలకు 2వేలకు పైగా పోస్టులు

దేశ వ్యాప్తంగా వివిధ పోస్టల్‌ సర్కిళ్లలో 2024-25 సంవత్సరానికి ఉద్యోగ ఖాళీల భర్తీకి గ్రామీణ డాక్ సేవక్ (జీడీఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 44,228 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఎలాంటి రాత పరీక్ష నిర్వహించకుండానే.. కేవలం పదో తరగతిలో సాధించిన మార్కుల ఆధారం గా ఉద్యోగం పొందవచ్చు. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 5, 2024వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాష్ట్రాల వారీగా ఖాళీలను కూడా వెబ్‌సైట్లో పొందుపరిచారు. తెలుగు రాష్ట్రాల్లో భారీగానే ఖాళీలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 1,355 పోస్టులు, తెలంగాణలో 981 పోస్టుల వరకు ఉన్నాయి.

పోస్టుల వివరాలు ఇవే..

బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (బీపీఎం)
అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం) డాక్‌ సేవక్‌

మొత్తం పోస్టుల సంఖ్య:
44,228

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పదో తరగతిలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. వయోపరిమితి కింద తప్పనిసరిగా అభ్యర్ధుల వయసు 18 నుంచి 40 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపు ఉంటుంది. కంప్యూటర్‌ నాలెడ్జ్‌తోపాటు సైకిల్‌ తొక్కడం వచ్చి ఉండాలి. బ్రాంచ్ పోస్టు మాస్టర్‌ (బీపీఎం) పోస్టులకు నెలకు రూ.12 వేల నుంచి రూ.29,380 వరకు జీతంగా చెల్లిస్తారు. అసిస్టెంట్‌ బ్రాంచ్‌ పోస్టు మాస్టర్‌ (ఏబీపీఎం), డాక్‌ సేవక్‌ పోస్టులకు నెలకు రూ.10 వేల నుంచి రూ.24,470 వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం ఇలా..

ఎలాంటి రాత పరీక్ష ఉండదు. అభ్యర్థులు పదోతరగతిలో సాధించిన మెరిట్‌లిస్ట్‌ మార్కుల ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేసి ఎంపిక చేస్తారు. ఎంపికైన వారందరికీ ధృవీకరణ పత్రాల పరిశీలన జరిపి, పోస్టులను కేటాయిస్తారు. ఇందుకు సంబంధించి వివరాలు అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్