ఇక కొడాలి నాని వంతు..
విజయవాడ, మార్చి 11, (వాయిస్ టుడే )
Now it's my turn to beat..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్కటే చర్చ. అదే కొడాలి నాని అరెస్ట్ ఎప్పుడు. అటు టీడీపీ క్యాడర్‌లో..ఇటు ప్రజల్లో ఇదే హాట్ టాపిక్‌గా కొనసాగుతూ వచ్చింది. ఇదే రోలో వల్లభనేని వంశీ పేరు కూడా వినిపించేది. కట్ చేస్తే 15 రోజుల కిందే ఆయన అరెస్ట్ అయ్యారు. విజయవాడ సబ్ జైలులో ఉన్నారు.పది రోజుల క్రితం పోసాని కృష్ణమురళిని కూడా హైదరాబాద్‌లో అరెస్ట్ చేశారు ఏపీ పోలీసులు. ఆ తర్వాత పలు కేసుల విషయంలో ఆయనను వరుస పెట్టి విచారణ చేస్తున్నారు. ఇక ఇప్పుడు కొడాలి నాని వంతు వచ్చిందంటున్నారు టీడీపీ క్యాడర్. కానీ ఆయన అరెస్ట్ ఎప్పుడంటూ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తున్నారు.వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది నేతలు నోటికి ఎంతొస్తే అంత మాట్లాడారని గుర్తు చేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇప్పుడు కూటమి పవర్‌లో ఉండటం..పలువురి నేతలను అరెస్ట్ చేయడంతో ఎందుకొచ్చిన తంటా అని నోరు మెదపడం లేదు నేతలు. అయితే ఇప్పుడు సైలెంట్‌గా ఉంటున్నప్పటికీ..వైసీపీ హయాంలో ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారిని అసలు వదిలిపెట్టొదని టీడీపీ క్యాడర్ అధిష్టానం మీద ప్రెజర్ పెడుతోంది. దీంతో అన్ని వివరాలు రెడ్ బుక్‌లో ఉన్నాయి. దాని ప్రకారం అంతా జరిగిపోతుందని చెబుతున్నారట టీడీపీ పెద్దలు.ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జైలులో ఉన్నారు. ఆయన మీద బలమైన సెక్షన్లతో కేసులు పెట్టారు. బెయిల్ రావడానికి చాలా సమయం పడుతుంది. ఇక పోసాని కృష్ణమురళి విషయంలోనూ ఇలాగే ఉంది. ఆయనను ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లకు తిప్ప్పుతున్నారు. కేసులు కూడా లెక్కకు మిక్కిలి ఉన్నాయి. ఇక ఈ ఇద్దరి తర్వాత ఎవరూ అంటే వైసీపీలో ఫైర్ బ్రాండ్‌గా పేరున్న మరో నేత పేరు కీలకంగా వినిపిస్తోంది. టీడీపీ కార్యకర్తల వేళ్లన్నీ మాజీ మంత్రి కొడాలి నాని వైపే చూపిస్తున్నాయి.అసలు ఆయన ఎక్కడ ఉన్నారో కూడా ఎవరికీ తెలియడం లేదంటున్నారు. కొడాలి నాని ఈ మధ్య వంశీని అరెస్టు చేసినప్పుడు జగన్ ములాఖత్‌కు వెళ్తే ఆయనతో పాటు కనిపించారు. ఇప్పుడు ఆయన మీద కూడా కేసులు పెట్టడానికి సిద్ధం అవుతోందని అంటున్నారు. నాని కూడా ఒకటి కాకపోతే ఎన్ని కేసులైనా పెట్టుకోనివ్వండి అంటూ స్టేట్‌మెంట్ ఇచ్చారు.అయితే బయటికి గంభీరంగా ఉన్నప్పటికీ..కొడాలి నానిని కూడా అరెస్ట్ భయం వెంటాడుతోందట. నెక్స్ట్ అరెస్ట్ తనదేనని ఆయన మానసికంగా సిద్ధమై ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఏదైతే గదైందని ఆయన వాయిస్‌లో బేస్ పెంచారని అంటున్నారు.కొడాలి నానిని రెండు రకాలు రౌండప్ చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. అవినీతి కేసులతో పాటు చంద్రబాబు, అనుచిత వ్యాఖ్యలు చేశారన్న దాని మీదనే కేసులు పెడతారన్న టాక్ వినిపిస్తోంది. పోసాని కేసుల మాదిరిగానే అని అంటున్నారు. చంద్రబాబు, లోకేశ్ కుటుంబాన్ని వ్యక్తిగతంగా తిట్టారని విశాఖ త్రీ టౌన్ పీఎస్‌లో కొడాలి నాని మీద ఇప్పటికే కేసు నమోదు అయింది.ఆ కేసు లింకుతో ఒక దాని తర్వాత ఒకటి అన్నట్లుగా పీటీ వారెంట్లు ఇస్తూ పోతే నాని కూడా ఇబ్బందులు ఫేస్ చేయకతప్పదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేష్ మీద హాట్ కామెంట్స్ చేశారు కొడాలి నాని. దాంతో కొడాలి మీద చర్యలకు టీడీపీ క్యాడర్ పట్టుబడుతుందట. అయితే సమయం చూసి నానిని కూడా అరెస్ట్ చేస్తారన్న టాక్ అయితే బలంగా వినిపిస్తోంది. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుందో..