- Advertisement -
జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకూ జరగనున్న నుమాయిష్
Numaish will be held from January 3 to February 15
హైదరాబాద్ డిసెంబర్ 30
ఏటా కన్నులపండుగగా సాగే 84వ అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన నుమాయిష్ జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకూ జరగనున్నది.ఇందుకు గాను ఏర్పాట్లు పూర్తి చేసింది తెలంగాణ ప్రభుత్వం. దేశంలోనే అతిపెద్దదైన ఈ ఎగ్జిబిషన్ ప్రతి సంవత్సరం జనవరి 1న నాంపల్లి గ్రౌండ్‌లో వేడుకగా నిర్వహిస్తారు. కానీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి కారణంగా వారం రోజులు సంతాపదినాలుగా ప్రకటించడంతో ఈసారి జనవరి 3కి వాయిదా పడింది. జనవరి 3 నుంచి ఫిబ్రవరి 15 వరకూ జరగనున్న నుమాయిష్ సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్‌లు హాజరుకానున్నట్లు సమాచారం.
- Advertisement -