Thursday, March 5, 2026

తెలంగాణలో స్థానిక సంస్థల సంఖ్య ఖరారు

- Advertisement -

తెలంగాణలో స్థానిక సంస్థల సంఖ్య ఖరారు
హైదరాబాద్, జూలై 17, (వాయిస్ టుడే)

Number of local bodies finalized in Telangana

రాష్ట్రంలోని జెడ్పీ, ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ స్థానాలపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన చేసింది. జడ్పీలు 31, ఎంపీపీలు 566, జడ్పీటీసీలు 566, ఎంపీటీసీలు 5,773, గ్రామపంచాయతీలు 12,778, వార్డులు లక్షా 12 వేలు ఉన్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ నేపథ్య్యంలో రాష్ట్రంలోని జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలను బుధవారం ఖరారు చేసింది. రాష్ట్రంలో మొత్తం 31 జడ్పీ స్థానాలు, 566 ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు.. 5,773 ఎంపీటీసీ స్థానాలు ఉన్నట్లు వెల్లడించింది.రాష్ట్రంలో మొత్తం 12,778 గ్రామ పంచాయతీలు ఉండగా… 1.12 లక్షల వార్డులు ఉన్నట్లు ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వెలువడనున్న నేపథ్యంలో వీటిపై ప్రకటన చేసింది.మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సర్వం సిద్ధం కావాలని పంచాయతీరాజ్‌ శాఖ సిబ్బందిని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికలకు అవసరమయ్యే సామాగ్రి అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది.
ఏర్పాట్లు ముమ్మరం
తెలంగాణలో స్థానిక ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. ఓవైపు ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకువేస్తుండగా… మరోవైపు ఏర్పాట్ల ప్రక్రియపై ఎప్పటికప్పుడు ఎన్నికల సంఘం పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే సిబ్బందికి శిక్షణ ప్రక్రియను కూడా పూర్తి చేసింది. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే… షెడ్యూల్ విడుదల చేసేందుకు సిద్ధమైంది.రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ… ఈసారి పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకునే పనిలో పడింది. అయితే అధికారంలోకి రాకముందు నుంచే బీసీ రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకొచ్చిన ఆ పార్టీ…. కామారెడ్డిలో డిక్లరేషన్ కూడా చేసింది. కులగణన, బీసీ కమిషన్‌ నివేదిక ఆధారంగా బీసీల రిజర్వేషన్లను పెంచుతామని ప్రకటించింది. ఇందుకు అనుగుణంగా…. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ కులగణన చేపట్టింది. డెడికేషన్ కమిషన్ కూడా ఏర్పాటు చేసింది. అసెంబ్లీలో తీర్మానం కూడా చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి కూడా పంపింది.కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ ఆర్డినెన్స్‌ జారీకి కేబినెట్ నిర్ణయించింది. అయితే శాసనసభ, మండలిలను ప్రొరోగ్‌ చేయకుండా ఆర్డినెన్స్‌ తీసుకురావడానికి నిబంధనలు అంగీకరించవు. ఈ నేపథ్యంలో…. శాసనసభ, మండలిలను ప్రొరోగ్‌ చేస్తూ గవర్నర్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో త్వరలోనే ఆర్డినెన్స్ జారీ అయ్యే అవకాశం ఉంటుంది.రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ ఆధారంగా… స్థానిక ఎన్నికల ప్రక్రియ మరింత వేగవంతమవుతుంది. ఆ వెంటనే రిజర్వేషన్లపై ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంటుంది. పంచాయతీలు, మండల, జిల్లా పరిషత్ లకు సంబంధించిన రిజర్వేషన్లు ఖరారవుతాయి. అయితే గతంలో ఉన్న రిజర్వేషన్లే అమల్లో ఉంటాయా…? లేక ఏమైనా మార్పులు ఉంటాయా…? అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై ఇచ్చే ఆర్డినెన్స్ నిలబడుతుందా అన్న చర్చ గట్టిగా తెరపైకి వస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు 50 శాతం రిజర్వేషన్లు దాటవద్దనే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ తీసుకువచ్చే ఆర్డినెన్స్ పై అనేక అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కోర్టుల ముందుకు ఈ ఆర్డినెన్స్ నిలబడవనే విశ్లేషణలు తెరపైకి వస్తున్నాయి. బీసీల రిజర్వేషన్ల పెంపు బిల్లులను 9వ షెడ్యూల్‌ చేర్చి… పార్లమెంటు ఆమోదం పొందే దిశగా ముందుకెళ్తే తప్పు… రిజ్వేషన్ల పెంపు సాధ్యం కాదని పలువురు చెబుతున్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై అసెంబ్లీలో తీర్మానం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉంది. ఈ నేపథ్యంలో ఇదే బిల్లుకు సంబంధించి ఆర్డినెన్స్ ఇవ్వొచ్చా అన్న చర్చ కూడా తెరపైకి వస్తోంది.ప్రస్తుత గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 12,777 గ్రామ పంచాయతీలున్నాయి. 5,982 మండల పరిషత్‌ ప్రాదేశిక నియోజకవర్గాలు, 585 జడ్పీటీసీ స్థానాలు ఉండగా… వీటన్నింటికి ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆర్డినెన్స్ జారీ తర్వాత… ఎన్నికల ప్రక్రియ వేగవంతమయ్యే అవకాశం ఉంటుంది. మరోవైపు సెప్టెంబర్ 30లోపు ఎన్నికలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఒక వేళ ఆర్డినెన్స్ జారీపై న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తుతే…. ప్రభుత్వం ఎలా ముందుకెళ్తోందనేది కూడా చర్చనీయాంశంగా మారింది…!రాష్ట్ర ఏర్పాటు తర్వాత తొలిసారిగా అధికారంలోకి వచ్చిన హస్తం పార్టీ… ఈసారి పంచాయతీ, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోనుంది. క్షేత్రస్థాయిలో ఉన్న నేతలు కూడా…. పార్టీ గెలుపు కోసం కృషి చేసే దిశగా అడుగులు వేసే పనిలో ఉన్నారు. హస్తం జెండా ఎగరవేయటమే లక్ష్యంగా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పావులు కదిపేస్తున్నారు. షెడ్యూల్ వచ్చే నాటికే గ్రౌండ్ క్లియర్ గా ఉండాలని కాంగ్రెస్ అధినాయకత్వం భావిస్తోంది. ఇక అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోని స్థానిక పోరులో సత్తా చాటాలని బీఆర్ఎస్ తో పాటు బీజేపీ చూస్తున్నాయి.రాబోయే స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఆశావాహులు పావులు కదిపేస్తున్నారు. రిజర్వేషన్ల ఖరారుపై స్పష్టత రాగానే… మరింత దూసుకెళ్లాలని భావిస్తున్నారు. చాలా రోజులుగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. గెలుపు కోసం అవసరమైన అన్ని మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈసీ నుంచి ప్రకటన వెలువడితే… పల్లెల్లో పొలిటికల్ హీట్ మరింత పెరగనుంది.రాష్రంలోని గ్రామపంచాయతీల్లోని సర్పంచ్ లో పదవీ కాలం గతేడాది జనవరి 31వతో ముగిసింది. ఆ తర్వాత నుంచి గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. 2024 జూన్ మాసంలోనే ఎంపీటీసీలు, జడ్పీటీసీల పదవీ కాలం కూడా ముగిసింది. ఈ స్థానాలకు కూడా ఎన్నికలు జరగాల్సి ఉంది. పదవీకాలం ముగిసిన తర్వాత వెంటనే నిర్వహించే అవకాశం ఉన్నప్పటికీ… ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికలు రావడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఆ తర్వాత కుల గణన కార్యక్రమం చేపట్టడంతో ఆలస్యమైంది.=

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్