అంగన్వాడీ సెంటర్లో పౌష్టికాహార అవగాహన సదస్సు
Nutrition Awareness Seminar at Anganwadi Centre
అంగన్వాడీ సెంటర్ ను సందర్శించిన హెచ్ఆర్ఎఫ్ ప్రతినిధులు
విజయవాడ,
విజయవాడ మున్సిపాలిటీ పరిధి 37వ డివిజన్లో ని అంగన్వాడి సెంటర్ నందు హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం పిల్లలకు, తల్లులకు పౌష్టికాహారం పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పిల్లల ఆరోగ్యం పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు గురించి హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు అంగన్వాడి టీచర్ ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆట బొమ్మల పేర్లు, కూరగాయల పేర్లు పిల్లల నుండి అడిగి తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు ప్రతినెల అంగన్వాడి సెంటర్ నుండి పౌష్టికాహారం అందుతుందో లేదో అడిగి తెలుసుకున్నారు. పిల్లల తల్లులు ఇచ్చిన సమాధానం పట్ల హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ప్రతినిధులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ ఫౌండేషన్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఎస్ లిల్లెమ్మ, హెచ్ఆర్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఎన్. ఝాన్సీ, తోపాటు అంగన్వాడి టీచర్, అంగన్వాడి ఆయా, పిల్లలు, తల్లులు పాల్గొన్నారు.