కొత్తగా నిర్మించే వెంచర్లు, బిల్డింగ్ లు, అపార్ట్ మెంట్లకు లోన్లు ఇవ్వాలంటే ‘హైడ్రా’ నుంచి ఎన్ వోసీ
NVOC from 'HYDRA' to give loans for newly constructed ventures, buildings and apartments
తీసుకొని రావాలని నిర్మాణదారులకు బ్యాంకర్లు కండీషన్ పెడుతున్నట్లు తెలుస్తోంది. బాచుపల్లి మండల పరిధి ప్రగతినగర్ పరిధిలోని 134 సర్వే నంబరులో 3.03 ఎకరాల్లో విస్తరించిన ఎర్రకుంటలో ఐదంతస్తుల్లో నిర్మిస్తున్న మూడు అపార్ట్ మెంట్లను ఇటీవల హైడ్రా అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామున మొదలైన కూల్చివేతలు రాత్రి 11 వరకు సాగాయి. ఆ నిర్మాణాలు ఎర్రకుంట చెరువకు చెందిన ఎఫ్‌టీఎల్(ఫుల్ ట్యాంక్ లెవెల్),బఫర్ జోన్ పరిధిలోకి వస్తాయని అధికారులు గుర్తించారు. అయితే, ఈ అపార్ట్ మెంట్లను 70 శాతం బ్యాంక్ లోన్లతోనే నిర్మించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ లోన్లు ఎలా రికవరీ చేయాలనే టెన్షన్ ఆయా బ్యాంక్ అధికారులకు పట్టుకుంది. ఈ నేపథ్యంలోనే కొత్తగా నిర్మించే వాటికి విలేజ్ మ్యాప్, ఓల్డ్ మ్యాప్, ఎఫ్ టీఎల్ క్లియరెన్స్ తో పాటు హైడ్రా నుంచి ఎన్ వోసీని తీసుకొని రావాలని నిర్మాణదారులకు బ్యాంకర్లు చెబుతున్నట్లు సమాచారం.