- Advertisement -
అక్టోపస్ ౩వ బెటాలియన్ పాసింగ్ ఔట్ పెరేడ్
Octopus 3rd Battalion Passing Out Parade
రంగారెడ్డి
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని అక్టోపస్ లో 3వ బేటాలియన్ దీక్షాంతం పెరేడ్ కార్యక్రమానికి రాష్ట్ర ఇంటలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరైయారు.
శివధర్ రెడ్డి మాట్లాడుతూ నూతనంగా 3వ బేటాలియన్ లో శిక్షణ పొందిన 288 మంది కానిస్టేబుల్ కు శుభాకాంక్షలు తెలిపారు. మీ రాకతో రాష్ట్రములో శాంతి భద్రతలు బలోపేతం అవుతయాని ఆశిస్తున్నా. సైబర్, ఆర్థిక, ఉగ్రవాదం వంటి సేవలలో సంవర్ధవంతంగా పనిచెయ్యాలి. శాంతి భద్రత సమయంలో నెలల తరబడి పనిచేయాలిసిన అవసరం ఉంటుంది. శాంతికి భంగం కలిగించే ధర్నాలు, ఉద్యమాలు వంటి వాటిని సంవర్ధంతంగా ఎదురుకోవాలి. పోలీసులకు పరిమితమైన స్వేచ్ఛ మాత్రమే ఉంటుంది,రాజకీయం వంటి వాటిలో సభ్యత్వం ఉండరాదు, మనకు పోలీసులకు ఎలాంటి సంఘాలు ఉండవు, పోలీసుల అసోసియేషన్ మాత్రమే ఉంటుందని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలని అన్నారు.
భారత 33 రాజ్యాంగం లో నేవి, వాయు, పోలీసులకు కఠినమైన నిబంధనలు ఉయ్యాన్నారు. ఇతర ఉద్యోగాలతో మనం పోల్చుకోవడం సమంజసం కాదు. సోషల్ మీడియాపట్ల పోలీసులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
డిపార్ట్మెంట్ కి ఎలాంటి సమయంలో చెడ్డపేరు తెవొద్దు,ఎలాంటి ప్రలోభాలకు లొంగొద్దు. పోలీసు వ్యవస్థకు గౌరవాన్ని తీసుకొస్తరని ఆశిస్తున్నాని రాష్ట్ర ఇంటలిజెన్స్ డీజీపీ శివధర్ రెడ్డి తెలిపారు.
3 వ బేటాలియన్ కమాండెంట్ జమీల్ భాషా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్,తమిళనాడు,అస్సాం, కర్ణాటక రాష్టాలలో సేవలందించారు. దీక్షంత్ పెరడ్ 288 మంది శిక్షణ పొందారు. మావోయీస్ట్,శాంతిభద్రతలు,విఐపి సెక్యూరిటీల నిర్వహిస్తామని తెలిపారు.
శిక్షణలో భాగంగా ప్రథమ చికిత్స సంబందించిన నైపుణ్యలు నేర్పించమన్నారు. తరువాత ఉత్తమ ప్రతిభను కనబరిచిన వారికీ బహుమతులను ప్రదానం చేసారు.
- Advertisement -