చికెన్ సెంటర్లపై అధికారుల దాడులు
కుళ్లిన చికెన్ గుర్తింపు
సికింద్రాబాద్..
Officials raid chicken centers
Rotten Chicken Identification
బేగంపేట్ అన్నా నగర్ లో అక్రమంగా నిల్వ ఉంచిన చికెన్ సెంటర్ లపై కంటోన్మెంట్ ఆహార భద్రత అధికారులు, టాస్క్ ఫోర్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. దాదాపు 600 కిలోల కుళ్లిన చికెన్ ను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. పూర్తిగా కుళ్ళి పాడైపోయిన స్థితిలో ఉన్న చికెన్ న్ విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఎస్ఎస్ఎస్, రవి చికెన్ దుకాణాలలో 600 కిలోల చికెన్ ను స్వాధీనం చేసుకున్నారు. రెండు మూడు నెలల పాటు నిల్వ ఉంచిన తక్కువ ధరకు మద్యం దుకాణాలు బార్లకు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్థానికుల ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించిన కంటోన్మెంట్, టాస్క్ ఫోర్స్ అధికారులు పాడైపోయిన చికెన్ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల బర్డ్ ఫ్లూ విస్తరిస్తున్న నేపథ్యంలో కుళ్ళిన చికెన్ విక్రయించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి దుకాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.