Sunday, March 8, 2026

ఈనెల 23న మున్నూరు కాపుల ఆత్మీయ ఆశీర్వాద కృతజ్ఞతా సభ

- Advertisement -

దాస్యం వినయ్ భాస్కర్ కు మద్దతు ప్రకటించిన మున్నూరు కాపుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండ దేవయ్య

హనుమకొండ లోని బి ఆర్ ఎస్ జిల్లా పార్టీ కార్యాలయ ప్రాంగణంలో వరంగల్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు కటకం పెంటయ్య ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మున్నూరు కాపుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కొండా దేవయ్య హాజరై మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో దాస్యం వినయ్ భాస్కర్ గెలుపు కోసం ఈనెల 23వ తేదీన సాయంత్రం ఐదు గంటలకు మున్నూరు కాపుల ఆత్మీయ ఆశీర్వాద కృతజ్ఞత సభను హన్మకొండలో నిర్వహిస్తామని తెలిపారు. సీఎం కేసీఆర్ దాస్యం వినయ్భాస్కర్ కు టికెట్ ఇవ్వడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు నాలుగు సార్లు గెలిపించుకున్నామని, ఐదవ సారి కూడా గెలిపించుకుంటామని అన్నారు.

On 23rd of this month, Munnur Kapula's spiritual blessing thanksgiving meeting
On 23rd of this month, Munnur Kapula’s spiritual blessing thanksgiving meeting

హనుమకొండ మహానగరం లో మున్నూరు కాపు భవన నిర్మాణానికి రూపాయలు 5.50 కోట్ల ను మంజూరు చేయించారని తెలిపారు. అలాగే 70 లక్షల రూపాయల టాక్స్ ఉంటే దాన్ని కూడా కేటీఆర్ తో మాట్లాడి మాఫీ చేయించారని తెలిపారు. వారిని బలపరుస్తూ మున్నూరు కాపుల ఆత్మీయ ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర, జిల్లా కమిటీ, యువకులు, సీనియర్ సిటిజన్స్,ఉద్యోగస్తులు, కుల బాంధవులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో హాజరుకావాలని అన్నారు. ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు కటకం పెంటయ్య మాట్లాడుతూ మున్నూరు కాపులకు కేసీఆర్ 10 సీట్లు ఇచ్చారని వారందరినీ కూడా గెలిపించుకోవాలని అన్నారు. దాస్యం వినయ్ భాస్కర్ కు మద్దతుగా 23వ తేదీన జరిగే సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పెరుకారి శ్రీధర్ రావు,జిల్లా కోఆర్డినేటర్ కనుకుంట్ల రవికుమార్,రాష్ట్ర నాయకులు వద్దిరాజు వెంకన్న, బండి కుమారస్వామి,వాసాల వెంకటేశ్వర్లు తో పాటు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్