ఆగస్టు 19 న కేసీఆర్  మెదక్ జిల్లా పర్యటన

ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి హరీష్ రావు మెదక్: ఆగస్టు 19వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్  మెదక్ జిల్లాలో నూతన సమీకృత కలెక్టర్ భవనంతో పాటు ఎస్పీ ఆఫీస్ ప్రారంభించనున్న నేపధ్యంలో జరుగుతున్న పనులను ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు  పరిశీలించి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ  సమీక్షలో ఎమ్మెల్యేలు పద్మ దేవేందర్ రెడ్డి,భూపాల్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, కలెక్టర్, ఎస్పీ ఇతర ఉన్నత అధికారులు పాల్గొన్నారు.