ప్రభుత్వం తరపున అన్ని విధాలా కాలనీలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..

- Advertisement -

ప్రభుత్వం తరపున అన్ని విధాలా కాలనీలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..*

— చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు,కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డి

— శేరిలింగంపల్లి నియోజ‌క‌వ‌ర్గం ఇంఛార్జి వి.జగదీశ్వర్ గౌడ్.

శేరిలింగంపల్లి; ఏప్రిల్20(వాయిస్ టుడే)
శేరిలింగంపల్లి నియోజకవర్గం కొండాపూర్ డివిజన్ పరిధిలోని అమర్ సొసైటీలో అనేక కాలనీ అసోసియేషన్ సభ్యులతో అల్పాహారం చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్.జి.రంజిత్ రెడ్డితో పాటు శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్ అల్పాహారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హ‌స్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాల‌ని, ప్రభుత్వం తరపున నియోజకవర్గం పరిధిలోని ఆయా కాలనీలలో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు, ప‌దేళ్ల బీజేపీ పాల‌న‌లో దేశంలో అభివృద్ధి మాటే లేకుండా పోయింద‌న్నారు. సంక్షేమ ప‌థ‌కాలు క‌నుమ‌రుగ‌య్యాయ‌న్నారు. కార్పొరేట్ శ‌క్తుల కోస‌మే బీజేపీ ప్ర‌భుత్వం ప‌ని చేస్తుంద‌న్నారు. పేద‌,మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల సంక్షేమాన్ని పూర్తిగా విస్మ‌రించార‌ని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular