మంత్రి కందుల దుర్గేష్ చొరవతో మార్టేరు- ప్రక్కిలంక రహదారి మరమ్మతుల పనులు ప్రారంభం
On initiative of Minister Kandula Durgesh, Marteru- Akhilanka road repair work has started
మంత్రి దుర్గేష్ ఆదేశాలతో శరవేగంగా కొనసాగుతున్న 12.7 మీ.ల గుంతల పూడ్చివేత పనులు
తీపర్రు వంతెన నుండి కాపవరం, మునిపల్లి వరకు ప్రారంభమై కొనసాగుతున్న పనులు
సీఎం, డిప్యూటీ సీఎం, ఆర్ అండ్ బి శాఖ మాత్యులతో చర్చించి రూ.1.17 కోట్లు విడుదలకు మంత్రి దుర్గేష్ కృషి
అదే విధంగా లూజ్ సాయిల్ సమస్య వల్ల కొన్ని నోడ్స్ లలో ఎన్ని సార్లు రోడ్డు ను మరమ్మత్తులు చేసిన కూడా మరలా పాడైపోతుందని తెలుసుకొని ఆ ప్రాంతాలలో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు వేయిపించుట కొరకు అధికారులతో మాట్లాడి 3.1 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు కూడా పంపడం జరిగింది .
కాంట్రాక్టర్లతో మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా మాట్లాడి పనుల ప్రారంభించడంతో హర్షం వ్యక్తం చేస్తున్న స్థానిక ప్రజానీకం
రాజమహేంద్రవరం/నిడదవోలు: రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ చొరవతో తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం గుండా వెళ్లే మార్టేరు – ప్రక్కిలంక రహదారి మరమ్మతుల పనులు ప్రారంభమై శరవేగంగా సాగుతున్నాయి. తీపర్రు వంతెన నుండి కాపవరం, మునిపల్లి వరకు పనులు మొదలయ్యాయి. 12.7 కి.మీల పొడవైన రహదారిపై గుంతలు పూడ్చేందుకు ఇప్పటికే రూ. రూ. 1.17 కోట్ల నిధులు మంజూరు అయినప్పటికీ కాంట్రాక్టర్ లు ఎవరూ టెండర్ లో పాల్గొనడానికి ముందుకు రాకపోవడంతో మంత్రి కందుల దుర్గేష్ ప్రత్యేకంగా చొరవ తీసుకొని సంబంధిత కాంట్రాక్టర్లతో మాట్లాడి రహదారి పనులను ప్రారంభించేందుకు కృషి చేశారు. ఆ రహదారిపై రాకపోకలు సాగించాలంటే చాలా ఇబ్బందిగా ఉండేదని, తరుచూ ప్రమాదాలకు కారణమైన ఆ రహదారి పనులు త్వరితగతిన పూర్తిచేయాలన్న ప్రజల విన్నపం మేరకు స్పందించిన మంత్రి దుర్గేష్ వెంటనే పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా రహదారి అభివృద్ధికి సహకరించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఆర్ అండ్ బి శాఖ మాత్యులు బి.సి. జనార్ధన్ రెడ్డికి మంత్రి దుర్గేష్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. పనులు శరవేగంగా సాగుతుండటంతో స్థానిక ప్రజానీకం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అడిగిన వెంటనే తమ మొర ఆలకించి పనుల ప్రారంభానికి చొరవ చూపించిన మంత్రి దుర్గేష్ కు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.