- Advertisement -
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ శేరిగూడ గ్రామంలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మంచిరెడ్డికి గ్రామస్థులు ఘన స్వాగతం పలికారు. గ్రామంలో రోడ్ షో నిర్వహిస్తూ నియోజకవర్గంలో జరిగిన అభివద్ధిని వివరించి మరోసారి ఓట్లు అడుగుతున్నారు. బి ఆర్ ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని కిషన్ రెడ్డి కోరారు.తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,చేసిన అభివృద్ధి కార్యక్రమాలే బి ఆర్ ఎస్ ను తప్పకుండా గెలుపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయంగా లబ్దిపొందాలని కొన్ని పార్టీలు అసత్యాలను ప్రచారం చేస్తూ ఓట్ల కోసమే గ్రామలలోకి వస్తున్నారని, అలాంటి వారిని నమ్మొద్దని తెలిపారు.
- Advertisement -