

సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ యాన్యూవల్ స్పోర్ట్స్ డే కార్యక్రమానికి హాజరై ఆటల్లో గెలిచిన చిన్నారులకు బహుమతులను అందచేసిన రాజ్యసభ సభ్యులు వడ్డీరాజు రవిచంద్ర , కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ .
అతి తక్కువ ఫీజులతో, విద్య రంగంలో ఎనలేని కృషి చేస్తున్న సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ చైర్మన్ మంగళరాపు లక్ష్మణ్ కి ప్రత్యేక అభినందనలు తెలియజేసిన రాజ్యసభ సభ్యులు వడ్డీరాజు రవిచంద్ర కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ శ్రీ హమీద్ పటేల్
కొండాపూర్ డివిజన్ పరిధిలోని రాఘవేంద్ర కాలనీలోని సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ యాజమాన్యం వారు నిర్వహించిన యాన్యూవల్ స్పోర్ట్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా రాజ్యసభ సభ్యులు వడ్డీరాజు రవిచంద్ర , కొండాపూర్ డివిజన్ కార్పొరేటర్ హమీద్ పటేల్ , అడ్వకేట్ లవంగాలఅనిల్ కుమార్ , కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ పెరుక రమేష్ పటేల్ , కొండాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకులు కచ్చావా దీపక్ విచ్చేసి ఆటల్లో ప్రతిభ కనబర్చి, గెలిచిన విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులను అందజేసి అభినందనలు తెలియజేశారు. కబడ్డీ, కోకో, రన్నింగ్, మ్యూజికల్ చైర్స్, స్కిప్పింగ్, షాట్ పుట్, పలు ఆటల్లో ప్రతిభ కనబర్చి, బహుమతులను గెలుపొందిన విద్యార్థిని, విద్యార్థులకు ఈ సందర్బంగా విచ్చేసిన పెద్దలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్బంగా సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ విద్యార్థిని, విద్యార్థులు ప్రదర్శించిన పలు సంస్కృతి, నృత్య కార్యక్రమాలు అలరించాయి.
ఈ సందర్బంగా సంస్కృతి గ్రూప్ అఫ్ స్కూల్స్ చైర్మన్ మంగళరాపు లక్ష్మణ్ ని, డైరెక్టర్ భార్గవి ని, ప్రిన్సిపాల్ జ్యోతిర్మయి ని, ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.




