Sunday, September 8, 2024

పొడుస్తున్న పొద్దుమీద….  ప్రజా గొంతుక మూగబోయింది

- Advertisement -

గద్దర్ గురించి ఆసక్తికర విషయాలు..

on-the-rising-horizon-the-voice-of-the-public-is-muted
on-the-rising-horizon-the-voice-of-the-public-is-muted

గుమ్మడి విఠల్‌రావ్‌.. అంటే చాలా మందికి తెలియదు.. అదే ప్రజా యుద్ధనౌక, ప్రజా గాయకుడు గద్దర్.. అనగానే తెలంగాణలోనే కాదు తెలుగు ప్రజలకు ఆయన తెలియని వారంటూ లేరు. ఒకప్పటి నక్సలైట్.. తన మాటనే పాటగా మలిచిన గొప్ప కళాకారుడు గద్దర్. తెలంగాణ ఉద్యమంలో తన పాట ద్వారా ఉద్యమానికి ఊపిరి పోసిన ఘనత ఆయన సొంతం.. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని ఆయన పాటలతో ఎంతోమందికి స్ఫూర్తి నింపారు. ఆయన పాట.. లక్ష గొంతుకల మాదిరిగా ప్రతిధ్వనించేదంటే.. ఆయన పాట ఎంతగా ప్రభావితం చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఎన్నో ఉద్యమాలకు ఊపు తెచ్చిన ప్రజాగాయకుడు గద్దర్ (74) కన్నుమూశారు. ఈ మధ్యనే గుండె ఆపరేషన్ చేయించుకున్న గద్దర్.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. ఈ విషయాన్ని గద్దర్ కుమారుడు సూర్యం అధికారికంగా వెల్లడించారు. దీంతో యావత్ తెలంగాణ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది.

గద్దర్ అసలు పేరు గుమ్మడి విట్టల్ రావు. 1949 తూప్రాన్‌లో జన్మించారు. నిజమాబాద్, హైదరాబాద్ లో విద్యాభ్యాసం చేశారు.. గద్దర్‌గా ప్రసిద్ధి చెందారు, ఒక భారతీయ కవి, విప్లవ బాలడీయర్, ఉద్యమకారుడు. 1987లో కారంచేడు దళితులహత్యలపై పోరాడిన గద్దర్.. నకిలీ ఎన్‌కౌంటర్లను తీవ్రంగా వ్యతిరేకించారు. తరువాత తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో చేరి.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు గద్దర్. తన పాటలతో ఉద్యమాలకు ఊపుతెచ్చారు గద్దర్‌.

1997 ఏప్రిల్‌ 6న గద్దర్‌పై హత్యాయత్నం జరిగింది. ఇక అమ్మ తెలంగాణమా, పొడుస్తున్న పొద్దుమీద పాటలతో.. తెలంగాణ ఉద్యమాలకు ఊపుతెచ్చారు గద్దర్‌. నీ పాదం మీద పుట్టుమచ్చనై చల్లెమ్మా అనే.. పాటకు నంది అవార్డు వచ్చింది. కాని నంది అవార్డును తిరస్కరించారు గద్దర్‌. మాభూమి సినిమాలో వెండి తెరపై కనిపించారు గద్దర్‌. జననాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్‌ కూడా ఒకరు.

మూగబోయిన ఉద్యమ గళం

నిజామాబాద్‌, హైదరాబాద్‌లో గద్దర్‌ విద్యాభ్యాసం జరిగింది. గద్దర్ 1975లో కెనరాబ్యాంక్‌లో ఉద్యోగం చేశారు.. గద్దర్‌కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.. జననాట్యమండలి వ్యవస్థాపకుల్లో గద్దర్‌ ఒకరు.. ఎన్నో విషయాల్లో ప్రభుత్వాల నిర్ణయాలను సైతం బహిరంగంగా వ్యతిరేకించారు. నికిలీ ఎన్‌కౌంటర్లు, సామాజిక అణచివేత, సమసమాజ స్థాపన తదితర అంశాలపై ఆయన ఎప్పుడూ తన గొంతును వినిపించేవారు.

కాగా.. గద్దర్‌ హఠాన్మరణం పట్ల రాజకీయ, సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆయన మృతి సమాజానికి తీరని లోటని సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలుపుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్