Sunday, September 8, 2024

రాష్ట్రంలో ప్రతి ఐదుగురి బాలికలలో ఒకరు లైంగిక వేధింపులకు గురి

- Advertisement -

రాష్ట్రంలో ప్రతి ఐదుగురి బాలికలలో ఒకరు లైంగిక వేధింపులకు గురి
సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి
సిద్దిపేట ఫిబ్రవరి 15
రాష్ట్రంలో ప్రతి ఐదుగురి బాలికలలో ఒకరు, ప్రతి 20 మంది బాలురలో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. మహిళల్లో 20% పురుషులలో 5-10% మంది తమ చిన్నతనంలో లైంగిక వేధింపులను ఎదుర్కొన్న వారే. వేధింపులను బాధితులలో 30% తమ బంధువుల చేతుల్లోనే వేధింపులను ఎదుర్కొంటున్నారు. బాధితులలో 60% తెలిసిన వారి చేతులలోనే దారుణాలకు గురవుతున్నారు. వారి కళ్ళకు… పొత్తిళ్లలోని పసిపాప మొదలుకొని 60 ఏళ్ల అమ్మమ్మ వరకు కామ వాంఛ తీర్చే వస్తువు లాగానే కనబడుతున్నారు.  ఎవరు వారు? ఎక్కడ ఉంటారు… అని అమాయకముగా అడగవద్దు! కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్న తండ్రి, తండ్రి తర్వాత అంతటి బాధ్యత ఉన్న అన్న, మామయ్య, పక్కింటి అన్నయ్య, ఎదురింటి బాబాయి, స్కూల్లో టీచర్, ఆటో అంకుల్… ఇలా ఎవరైనా కావచ్చు.  అమ్మాయి ఒంటరిగా కనిపిస్తే చాలు వావి వరసలు మరిచి మృగాలుగా మారిపోతున్నారు.  మానవత్వాన్ని వదిలేసి చూపులతో, చేష్టలతో విపరీతంగా ప్రవర్తిస్తూ పైసాచికానందం పొందుతున్నారు.  సంఘటన, ప్రాంతం, సందర్భము వేరు కావచ్చు… అన్నిచోట్ల ఇదే దుస్థితి. దీనికి అడ్డుకట్ట వేసే దారి లేదా…!  ఉంది ఆ మార్పు ముందు మన ఇంటి నుంచే మొదలవ్వాలి అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.
ఎక్కడ ఉంటారు…
ఈ తరహా నేరాలకు పాల్పడే వ్యక్తులు మీ ఇంట్లోనే ఉండొచ్చు…బస్సులలో, వీధిలో, స్కూల్లో, ఎక్కడైనా ఎదురు కావచ్చు. చాలావరకు వీరిని గుర్తించడం కష్టం. వీరిలో కొందరు స్వతహా గానే నేర స్వభావముతో పెరిగి పెద్దయి ఉండవచ్చు. ఇంకొందరు చూడ్డానికి మృదు స్వభావులుగా కనిపిస్తూ… మంచి అనే ముసుగేసుకుని బతికేస్తుంటారు.  అందుకే అనుమానం వచ్చిన ఎవరినీ తేలిగ్గా తీసుకోవద్దు. పసిపిల్లలకు రక్షణగా ఉండే వారి పైనా ఓ కన్నేయండి.
ఎందుకు ఇలా మారతారు…!
వావివరసలు, వయసు తేడాలు వేటిని లెక్కచేయకుండా పశు వాంఛలు తీర్చుకునే తెంపరితనం, పెరగటానికి ఎన్నో కారణాలు ఉండవచ్చు. అతిగారాభం, చెడుసావాసాలు, విచ్చిన్న కుటుంబాలలో ప్రేమానుబంధాలు దూరం కావటం వంటివి కారణాలు కావచ్చు. అలానే ఆయా వ్యక్తుల మెదడు పనితీరులో అసమానతలు, వ్యక్తిత్వ లోపము వంటి వాటికి, అసంతృప్తికర వైవాహిక జీవితం, ఒంటరితనం, సామాజిక మాధ్యమాలలో విచ్చలవిడితనం, పోర్నోగ్రఫీ చూడటానికి అలవాటు పడటం వంటివన్నీ, తోడై విపరీత లైంగిక కోరికలకు కారణమవుతున్నాయని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు.
బాధితులెవరు?
చాలా అధ్యయనాల ప్రకారం ఆడా, మగా పిల్లలు ఇద్దరూ బాధితులేనట. మన చుట్టూ ఉన్న వారిలో చాలామంది ఏదో ఒక సందర్భంలో లైంగిక హింసకు గురైన వారేనని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. కొంతమంది పిల్లలు తమపై వేధింపులు జరిగాయన్న విషయాన్ని గుర్తించలేరట.  ఇక ఒంటరిగా ఉన్న మహిళలు, కష్టాలలో ఉన్న అమ్మాయిలు, బలహీన వ్యక్తిత్వము ఉన్న స్త్రీలను లక్ష్యంగా చేసుకొని ఆయా వ్యక్తులు దురాగతాలకు పాల్పడుతున్నారు అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.
లైంగిక హింసకు గురైతే…!
ఒకవేళ ఎవరైనా లైంగిక దాడికి, హింసకు బాధితులు అయితే వారిని సకాలంలో గుర్తించి బయటకు తీసుకురావాలి. ఇందుకోసం పోలీసులు, వైద్యులు, మానసిక నిపుణుల సహాయం తీసుకోవాలి. లేదంటే వారు భవిష్యత్తులో తీవ్ర ఉద్వేగాల బారినపడతారు. కుంగుబాటుకి గురై ఆత్మహత్యకు ప్రయత్నిస్తారు. తమని తాము హింసించుకోవడం లేదా ఇతరులని హింసించడం చేస్తుంటారు. మహిళలను లేదా పురుషులను తీవ్రంగా ద్వేషించి ప్రమాదం ఉంది. ఇలా వేధింపులకు గురైన వారు… నలుగురిలోనూ కలువరని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.
అమ్మాయిలు జాగ్రత్త!
ఆధునికత పేరుతో తీసుకునే చొరవ కొత్త సమస్యలను సృష్టించవచ్చు. స్నేహము, ప్రేమ ఏదైనా హద్దు మీరవద్దు. ఇతరులపై ఆధారపడటం, సానుభూతి కోరుకోవటం వల్ల మీరు బలహీనులుగా మారే ప్రమాదం ఉంది. దాన్ని దుర్బుద్ధి ఉన్న వ్యక్తులు అవకాశం గా మలుచుకుంటారు. అపరిచితులతో పరిచయాలు, సోషల్ మీడియా ద్వారా స్నేహం, ప్రేమ వంటి వాటిని నమ్మవద్దు. మీ వ్యక్తిగత వివరాలను ఇతరులతో పంచుకోవద్దు. ఇంట్లో అయినా ఒంటరిగా ఉండాల్సి వస్తే… తప్పనిసరిగా అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేసుకోండి. రాత్రిపూట ఒంటరిగా ప్రయాణాలు, పార్టీలు వద్దు. తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్ళవలసి వచ్చిన ఎవరో ఒకరి సహాయం తీసుకోండి. ర్యాగింగ్, టీజింగ్… ప్రేమ అంటూ ఎవరైనా వెంట పడుతున్న, మీతో తప్పుగా ప్రవర్తిస్తున్న, అసభ్యకరమైన సందేశాలు, మాటలు, చేష్టలతో విసిగిస్తున్న… ఏమాత్రము అలసత్వము ప్రదర్శించవద్దు.  ఇది ఏదో ఒక రోజు ముప్పు కలిగించవచ్చు. మీపై అధికారులు, టీచర్లు లేదా కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోండి అని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.
తల్లిదండ్రులు… ఇవి ముఖ్యం!
చాలామంది తమ పిల్లలకు రక్షణ కల్పించడం ఒక్కటే విధి అనుకుంటారు. వాళ్లు ఫోన్లలో ఏం చేస్తున్నారో, వాళ్ల స్నేహితులు ఎలాంటివారో గమనిస్తూ ఉండాలి. మానసికంగా ఏవైనా మార్పులు కనిపిస్తున్నప్పుడు చూసి చూడనట్లు వదిలేయవద్దు. కౌమారములో అడుగుపెట్టినప్పటి నుంచి వారిలో కొత్త మార్పులు, కోరికలు, పక్కదారి పట్టించొచ్చు. పరిస్థితిని గమనించుకొని మానసిక నిపుణులను కలవడం మంచిది. చిన్నప్పటి నుంచి పిల్లలకు నైతిక ప్రవర్తన, నియమాలు అలవాటు చేయాలి. లైంగిక విద్యపై అవగాహన కల్పించాలి. అలాగే ఆడపిల్లకు మాత్రమే హద్దులు చెప్పడం సరిపోదు. అబ్బాయిలు అమ్మాయిలతో ఎలా మెలగాలో, వారి ఆత్మాభిమానాన్ని దెబ్బతీయకుండా ఉండేందుకు వారు ఎలా మారాలో చెప్పాలి. పిల్లలందరికీ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి చెప్పాల్సిందే. లేదంటే వ్యక్తిగత, శరీర భాగాలపై చేతులు వేయటం, బలవంతం చేయటం, లైంగిక చర్యకు ప్రేరేపించడం,  ప్రేమ పేరుతో లొంగదీసుకోవాలనుకోవడం వంటివన్నీ చేయవచ్చు. ఇలా చెప్పడం వల్ల వాటిని ముందే పసిగట్టి తప్పించుకోగలుగుతారు. ఒంటరిగా పిల్లలను వదిలి వేయవద్దు. పిల్లల బాధ్యత ఎవరికి అప్పగించినా వారు ఎంత దగ్గర వారైనా సరే వారిపై ఒక కన్నెయాల్సిందే. అలానే ఎవరినైనా చూసి చిన్నారులు భయపడుతున్న చదువులో వెనుకబడినా దేనికైనా ఆందోళన చెందుతున్న… తీసి పడేయొద్దు. పొరపాటున మన పిల్లలే బాధితులు అయితే వారిని కొట్టడం, తిట్టడం సరికాదు. ముందు ఉపశమనం కలిగించే చర్యలు తీసుకోవాలి. ఎలాంటి విపత్కర పరిస్థితి ఎదురైనా సరే మీతో పంచుకునే చనువు వారికి మీరు ఇవ్వాలి. పిల్లలకే కాదు… మహిళలందరికీ ఆత్మరక్షణ విద్యలు అవసరం. స్వీయ సంరక్షణ పద్ధతులు మిమ్మల్ని ఆపత్కాలంలో ఆదుకుంటాయని డాక్టర్ లిల్లీ మేరి పేర్కొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్