పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత వచ్చేలా కృషి చేయాలి
One should strive to get hundred percent pass in class 10thజిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
పెగడపల్లి మాడల్ స్కూల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
జగిత్యాల,
పదవ తరగతిలో విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ సూచించారు.బుధవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మాడల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేసారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పాఠశాలను మొత్తం సందర్శించి విద్యార్థుల స్థితిగతులను, వారికి కల్పిస్తున్న వసతులను అడిగి తెలుసుకున్నారు.
అదే విధంగా విద్యా ప్రమాణాలు, మౌళిక సదుపాయాల గురించి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారా లేదా అని ఇంటర్మీడియట్ చదువుతున్న విద్యార్థులను ఉపాద్యాయులు ఏ విదంగా బోధిస్తున్నారని అలాగే సెలబస్ ఎంతవరకు అయిందని కలెక్టర్ తెలుసుకున్నారు.10వ తరగతి విద్యార్థులకు వంద శాతం ఉత్తీర్ణత వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, వెనుక బడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించి వంద శాతం ప్రగతి సాధించే విధంగా విద్యా బోధనకు కృషి చేయాలన్నారు.
అనంతరం విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించి, నాణ్యమైన అహర పదార్థాలు, తగిన సమయ పాలన పాటించాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.ఈ కార్యక్రమంలో జగిత్యాల రెవెన్యూ డివిజనల్ అధికారి పి.మధు సుధన్,జిల్లా విద్యాధికారి కె. రాము, ఎమ్మార్వో, ఎంపీడీవో , తదితరులు పాల్గొన్నారు.



