రైతులకు ఇబ్బందులు కలగకుండా ఒక టిఎంసి నీటికి గోదావరిలోకి విడుదల చేయాలి
One TMC of water should be released into Godavari so that farmers do not suffer
*రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి
ఉత్తం కుమార్ రెడ్డి కి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి
ధర్మపురి,
గోదావరి లిఫ్ట్ ల పైన ఆధారపడి సుమారు 25 వేల ఎకరాలకు పైగా ఆయకట్టు సాగు అవుతుండగా కొన్ని అనుకొని పరిస్థితుల కారణంగా గోదావరిలో నీరు లేక సాగుకు ఇబ్బందులు కలుగుతుందని రైతులు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకెళ్లగా వెంటనే స్పందించి పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో కలిసి గురువారం రోజున గోదావరిని మరియు లిఫ్ట్లను పరిశీలించి రైతులతో మాట్లాడారు,రైతులకు ఎటువంటి ఇబ్బందులూ కలగకూడదనే ఉద్దేశ్యంతో ప్రత్యేకంగా హైదరాబాద్ వెళ్లి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి
ఉత్తం కుమార్ రెడ్డి ని వారి నివాసంలో శుక్రవారం రోజున ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాద పూర్వకంగా కలిసి గోదావరిలో ఒక టిఎంసి నీటికి విడుదల చేయాలని కోరుతూ వినతి పత్రాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
గోదావరి నది పైన సదర్ఘాట్ వద్ద గేట్ల నిర్మాణం కారణంగా ధర్మపురి తోపాటు జగిత్యాల నియోజకవర్గాల ప్రాంతాలకు గోదావరి నీరు అందక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,
గెట్లతో నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేయడం వల్ల మా ప్రాంతంలోని లిఫ్ట్ ఇరిగేషన్ స్కింలకు నీరు అందక 16 గ్రామాలకు చెందిన సుమారు 25 వేల ఎకరాల భూమినీ సాగు చేసుకోలేక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురై నష్టపోవడం జరుగుతుందని,కాబట్టి క్షేత్రస్థాయిలో ఇట్టి పరిస్థితి స్వయంగా సమీక్షించి ఒక టిఎంసి నీటికి గోదావరి నదిలో విడుదల చేసే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ వారికి వినతి పత్రాన్ని ఇచ్చారు.దీంతో మంత్రి ఉత్తం కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఈ సందర్భంగా విప్ తెలిపారు.