Wednesday, December 4, 2024

మెడికల్  కాలేజీలకు  అనుబంధంగా  ఆస్పత్రి  ప్రారంభం

- Advertisement -

మెదక్, అక్టోబరు 5:  తెలంగాణ సీఎం కేసీఆర్  ఢిల్లీ వచ్చినప్పుడు తనతో ఎన్డీఏలో చేరేందుకు ఆసక్తి చూపించారన, కేటీఆర్‌ను సీఎం ను చేసేందుకు సహకరించాలని కోరారని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు పరోక్షంగా స్పందించారు. కేసీఆర్ ఎప్పుడు ఢిల్లీకి వచ్చినా ప్రాజెక్టుల గురించి ..నిధుల గురించి అడుగుతారని.. అదే ఏపీ సీఎం జగన్ వస్తే..  సీబీఐ కేసుల గురించే మాట్లాడతారని పార్లమెంట్‌లోనే చెప్పారన్నారు. హరీష్ రావు మాటలు వైరల్ అవుతున్నాయి. సిద్దిపేటలో సిద్దిపేటలో మెడికల్ కాలేజీలకు అనుబంధంగా నూతనంగా నిర్మించిన 1000 పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ను  రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు  ప్రారంభించారు. 175 సీట్లు సిద్దిపేట మెడికల్ కళాశాలలో అడ్మిషన్లు పొందుతారని, ఇందులో 25% అంటే 25 సీట్లు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి చదువుతారని, ఢిల్లీ రాజస్థాన్ లాంటి రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి చదువుతున్నారంటే తెలంగాణ అభివృద్ధి ఏంటో అర్థం అవుతుందని ప్రశంసించారు.

opening-of-hospital-affiliated-to-medical-colleges
opening-of-hospital-affiliated-to-medical-colleges

గతంలో సిద్దిపేట మెడికల్ కాలేజ్ నుంచి మెరుగైన వైద్యం కోసం గాంధీ, ఉస్మానియా ఆసుపత్రికి పంపించేవారు కానీ ఇకపై నుండి ఇక్కడే సూపర్ స్పెషాలిటీ సేవలు అందుతాయని, నూతన క్యాన్సర్ బ్లాక్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఇకనుండి క్యాన్సర్ చికిత్స కూడా ఇక్కడే అందించబడుతుందని హరీష్ రావు పేర్కొన్నారు.ఈ ఆస్పత్రిలో 40 పడకల డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేశామని, 15 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు అందులో 8 మార్జిలర్ ఆపరేషన్ థియేటర్లు నిర్మించుకున్నామని, 100 ఐసియు బెడ్ లు పూర్తి సామర్ధ్యంతో సేవలు అందుబాటులోకి వస్తాయని ప్రైవేట్ కి దీటుగా వైద్య సేవలు అందిస్తామని వెల్లడించారు. 30 పడకలతో ఎమర్జెన్సీ వార్డు ఉంటుందని, 23 కోట్లతో 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాకు ఏర్పాటు చేయబోతున్నామని, 875 మంది వైద్య విద్యార్థులు ఉంటారని హరీష్ రావు వివరించారు. 13 డిపార్ట్ మెంట్లలో పిజి కోర్సులు అందుబాటులో ఉన్నాయని, మరో 3 నూతన పిజి సీట్లు ఏర్పాటు చేశామని, ప్రతి ఏడాది 62 మంది పిజి విద్యార్థులకు కూడా చదివే అవకాశం ఉందన్నారు.సంపన్నుల పిల్లలే డాక్టర్ చదువు చదవాలన్న నానుడిని మారుస్తూ రైతులు, కూలీల పిల్లలు కూడా ఎంబిబిఎస్ చేసే అవకాశం ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చారని కొనియాడారు. స్టాఫ్ నర్స్ ల పేరు మారుస్తూ నర్సింగ్ డాక్టర్ గా పిలుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సింగ్, బి ఫార్మసీ కాలేజ్ లు సిద్దిపేట లో ఉన్నాయని, 280 మంది డాక్టర్లు 24 గంటలు వైద్య సేవలు అందిస్తారని, వీరితోపాటు మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ పూర్తి చేసుకున్న 150 మంది డాక్టర్లు కూడా సేవలు అందిస్తారని ప్రశంసించారు.

opening-of-hospital-affiliated-to-medical-colleges
opening-of-hospital-affiliated-to-medical-colleges

ప్రాథమిక చికిత్స నుండి ప్రాణాంతక వ్యాధుల వరకు అన్ని వైద్య సేవలు అందించబడతాయని, ఒకప్పుడు మనం నీళ్లు చూడనోళ్లం..కానీ ఇప్పుడు కరువు కూడా తెలియడం లేదని హరీష్ రావు చెప్పారు.  నూతన క్యాన్సర్ బ్లాక్ నిర్మాణానికి కూడా శంకుస్థాపన చేయడం జరిగిందని, ఇకనుండి క్యాన్సర్ చికిత్స కూడా ఇక్కడే అందించబడుతుందన్నారు మంత్రి హరీష్ రావు. ఈ ఆస్పత్రిలో 40 పడకల డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారని, 15 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు, అందులో 8 మార్జిలర్ ఆపరేషన్ థియేటర్లు నిర్మించుకున్నామని తెలిపారు మంత్రి హరీష్ రావు. 100 ఐసీయూ బెడ్లను ఏర్పాటు చేసి, పూర్తి సామర్థ్యంతో సేవలు అందిస్తున్నామన్నారు. ప్రైవేటుకు ధీటుగా వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. 30 పడకలతో ఎమర్జెన్సీ వార్డు, రూ. 23 కోట్లతో 50 పడకల సూపర్ స్పెషాలిటీ క్రిటికల్ కేర్ బ్లాక్ ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు. 875 మంది వైద్య విద్యార్థులు ఉంటారని, 13 డిపార్ట్‌మెంట్లలో పీజీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, మరో 3 నూతన పీజీ సీట్లు ఏర్పాటు కానున్నాయని తెలిపారు మంత్రి. ప్రతి ఏడాది 62 మంది పీజీ విద్యార్థులకు కూడా చదివే అవకాశం ఉంటుందని వివరించారు. సంపన్నుల పిల్లలే డాక్టర్ చదువు చదవాలన్న నానుడిని మారుస్తూ రైతులు, కూలీల పిల్లలు కూడా ఎంబీబీఎస్ చేసే అవకాశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించారని పేర్కొన్నారు. స్టా్‌ఫ్ నర్స్‌ల పేరు మారుస్తూ నర్సింగ్ డాక్టర్‌గా పిలుస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు. నర్సింగ్, బి ఫార్మసీ కాలేజ్‌లు సిద్దిపేటలో ఉన్నాయని చెప్పారు. 280 మంది డాక్టర్లు, 24 గంటలు సేవలు అందిస్తారని తెలిపారు మంత్రి హరీష్ రావు. వీరితోపాటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేసుకున్న 150 మంది డాక్టర్లు కూడా సేవలు అందిస్తారన్నారు. ప్రాథమిక చికిత్స నుండి ప్రాణాంతక వ్యాధుల వరకు అన్ని వైద్య సేవలు అందించబడతాయన్నారు. ఒకప్పుడు మనం నీళ్లు చూడనోళ్లం.. కానీ ఇప్పుడు కరువు ఎరగనోల్లం అయ్యామని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. ‘ఒక ప్రాంతానికి కావాలిసిన కలలను సాకారం చేసుకున్నాం, సిద్దిపేట జిల్లా చేసుకున్నాం, సిద్దిపేటకు గోదావరి నీళ్లు తెచ్చుకున్నాం, సిద్దిపేట కి రైల్ కూడా తెచ్చుకున్నాం. వేయి పడకల ఆస్పత్రి వచ్చింది. ఇన్ని ఇచ్నిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు. సిద్దిపేట ప్రజలకు శుభాకాంక్షలు.’ అని మంత్రి హరీష్‌ రావు అన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్