Sunday, September 8, 2024

ఆపరేషన్.ముస్కాన్-Xనిర్వహణ పై సమీక్ష

- Advertisement -

సమాఆపరేషన్.ముస్కాన్-Xనిర్వహణ పై సమీక్ష సమావేశం

బాలకార్మికుల వివరాలు  తెలిస్తే సమాచారం ఇవ్వండి

బాల కార్మికుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు

పోలీస్ కమీషనర్.ఎం.శ్రీనివాస్
గోదావరిఖనిప్ర

జూలై 1 నుండి 31-07-2024 వరకు నిర్వహిస్తున్న ఆపరేషన్ ముస్కాన్-X నిర్వహణగురించి మంగళవారం. రామగుండం పోలీస్ కమిషనర్ఎం.శ్రీనివాస్ ఐపిఎస్.ఐజి.అద్యక్షతన పెద్దపల్లి,మంచిర్యాల జిల్లాల ఆపరేషన్ ముస్కాన్-X టీమ్  పోలీస్అధికారులు,సిబ్బంది.  చైల్డ్ వెల్ఫేర్ కమిటీ,లేబర్ డిపార్ట్మెంట్,ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్,చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్,హెల్త్ డిపార్ట్మెంట్ వివిధ డిపార్ట్మెంట్అధికారులు తో సిపి కార్యాలయంలో సమీక్షాసమావేశం నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ…..గతంలో నమోదైన కేసుల డేటా ఆధారంగాపిల్లలు బాల కార్మికులగాపనిచేస్తున్నహాట్ స్పాట్స్.పై నిఘా ఉంచాలి. గతంలో రెస్క్యూ చేసినపిల్లల యొక్కపరిస్థితిగురించిఅడిగి తెలుసుకోవాలి.స్కూల్ డ్రాప్ అవుట్ పిల్లలనుగుర్తించి వారిని స్కూల్ లలో చేర్పించాలి అదేవిధంగా ఆరోగ్య పరిస్థితి బాగాలేని పిల్లల ను గుర్తించి వారిని సంబందిత హాస్పిటల్లో చేర్పించి పరిక్షలు నిర్వహించి, చికిత్స అందేలా చూడాలి.ప్రతి షాప్స్ వద్ద ఇక్కడ బాల కార్మికులను నియమించలేదు. బోర్డ్స్ఏర్పాటుచేపించాలి. బాల్య వివాహాల చేయడం నేరం.బాల్య వివాహలపై అవగాహనకల్పించాలి.18 సంవత్సరాలలోపు బాలకార్మికులుగా పని చేస్తున్న పిల్లలు గొర్రెల,పశువుల కాపరులుగా,కిరాణం షాప్ లలో.మెకానిక్ షాపులలో, హోటళ్లలో.ఇటుక బట్టీలలో, పౌల్ట్రీ ఫామ్.లలొపని చేసిన, పిల్లలురోడ్డుపైభిక్షాటనచేస్తున్న,మరేఇతర ప్రదేశాలలో తప్పిపోయిన,వదిలివేయబడిన పిల్లలు బాలకార్మికులుగా పని చేస్తున్నట్లయితే అలాంటి వారిని గుర్తించి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి వారికి అప్పగించడం,లేదాస్టేట్.హోమ్ కు పంపించడం చేయాలని అన్నారు.వివిధ కారణాల వల్ల వారి కుటుంబాల నుండి విడిపోయిన తప్పిపోయిన మరియు గుర్తించబడని పిల్లలను గుర్తించడానికి *దర్పన్.అనే ఫేషియల్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను
ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. చిన్న పిల్లలతోఎవరైనా బలవంతంగాబిక్షాటన. వెట్టిచాకిరీ చేయించినవారిపై క్రిమినల్ కేసులునమోదుచేసి తగినచర్యలుతీసుకొంటామని,ఆపరేషన్.ముస్కాన్ -X లో భాగంగా బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి ప్రత్యేకంగా ప్రతి డివిజన్ పరిధిలోఒక ఎస్ఐ మరియు నలుగురు సిబ్బందిని నియమించడం జరిగిందని తెలిపారు.విరితో పాటు వివిధ డిపార్ట్మెంట్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించాలని సూచించారు.వివిధ డిపార్ట్మెంట్ అధికారులు అందరూ కలిసి సమిష్టిగా ఆపరేషన్ ముస్కాన్-X నిర్వహించి బాల కార్మికులు లేకుండా కట్టుదిట్టంగావిధులు నిర్వహించాలని సూచించారు. పెద్దపల్లి మంచిర్యాల జిల్లాలలో ఎవరైనా బాలకార్మికులను పనిలో పెట్టుకున్న, లేక వారితో బలవంతంగా పని చేయించిన,  తప్పిపోయిన,వదిలి
వేయబడిన,హింసకు బెదిరింపులకు గురవుతున్న వీధి బాలలను చూసినప్పుడు, 1098 లేదా డయల్ 100, స్థానిక పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని సీపీ తెలిపారు.
ఈ సమావేశంలో అడిషనల్ డిసిపి అడ్మిన్ రాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్ర రావు, సిసియస్ ఏసీపీ వెంకటస్వామి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ పెద్దపల్లిశ్రీధర్,చైల్డ్.వెల్ఫేర్.
కమిటీ మంచిర్యాల్ చైర్మన్  వహీద్,మంచిర్యాలడి డబ్ల్యు ఓ.చిన్నయ్య,మంచిర్యాల డిఎంహెచ్ఓ.వినీత, డీఎంహెచ్ఓ.పెద్దపల్లి కృపరాణి,ఇతర డిపార్ట్మెంట్  అధికారులు,ఆపరేషన్ ముస్కాన్ టీం పోలీస్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్