బీమారంగంలో ఎఫ్ డీ ఐ లను వ్యతిరేకించండి.
Oppose FDI in insurance sector.
సిఐటియు
బద్వేలు
బద్వేలు సిఐటియు పట్టణ కార్యాలయం నందు బీమా రంగంలో 100%.ఎఫ్ డీ ఐ కి, విదేశీ బీమా కంపెనీల ప్రవేశానికి వ్యతిరేకిస్తూ సిఐటియు ఆధ్వర్యంలో మంగళవారం పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది.*
ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కార్యదర్శి కె .శ్రీనివాసులు మాట్లాడుతూ …..రానున్న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో బీమా చట్ట సవరణ బిల్లు 2024 ను ప్రవేశ పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని,ఈ సవరణలతో దేశానికి కానీ, పాలసీదారులకు కానీ ఎటువంటి ప్రయోజనం లేదన్నారు.
ఈ సవరణలు చట్ట రూపం పొందితే, జాతీయకరణకు ముందు నాటి ప్రైవేటు కంపెనీల మోసాలు మళ్లీ పునరావృతమైతాయని అన్నారు. కాబట్టి ఈ చట్ట సవరణ బిల్లును తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం ఉందని, జాతీయకరణ లక్ష్యాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఎల్ఐసి ప్రపంచ స్థాయికి ఎదిగిందని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేట్ ఇన్సూరెన్స్ ని వ్యతిరేకిద్దాం, విదేశీ కంపెనీలను తిరస్కరిద్దాం పేరుతో సిఐటియు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందులో భాగంగానే జిల్లా వ్యాప్తంగా ఆందోళన నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామని ఈ కార్యక్రమాల్లో మేధావులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ కన్వీనర్ కె. నాగేంద్రబాబు, పట్టణ నాయకులు కె. శివకుమార్, ఎస్ .రాయప్ప, జి. సుబ్బరాయుడు, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.