- Advertisement -
ప్రజా వ్యతిరేక కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకించండి
Oppose the anti-people central budget
లేబర్ కోడ్స్ రద్దు చేయాలి.
అఖిలపక్ష కార్మిక సంఘాలు.
విశాఖపట్నం
కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్మిక రైతాంగ ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని దీన్ని యావత్ ప్రజానీకం, కార్మికవర్గం వ్యతిరేకించాలని అఖిలపక్ష కార్మిక సంఘాల నాయకులు పేర్కొన్నారు. కార్మికులకు నష్టం చేసేటటువంటి నాలుగు లేబర్ కోడ్స్ను రద్దు చేయాలని దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు విశాఖ నగరంలో జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా అఖిలపక్ష కేంద్ర కార్మిక సంఘాలైన సిఐటియు, ఏఐటియుసి, ఐఎన్టియుసి, సిఎఫ్టియుఐ, ఏపీఎఫ్టియు తదితర సంఘాల నాయకులు ఆర్కెఎస్వి కుమార్, జిఎస్జె అచ్యుతరావు,
బి.నాగభూషణం, ఎన్.కనకారావు, దేవా లు మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెట్టిందన్నారు. నేషనల్ మానిటైజేషన్ పైపులైన్ పేరుతో ప్రభుత్వ ఆస్తులను కార్పొరేట్ కంపెనీలకు ధారాధత్తం చేస్తుందన్నారు. మొన్న పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ అనుకూల బడ్జెట్ అని ఈ బడ్జెట్లో కార్మికులకు రైతులకు వ్యవసాయ కార్మికులకు దళితులు గిరిజనులు మైనార్టీలకు సంబంధించిన ఏ విధమైన నిధులు కేటాయించలేదన్నారు. విద్యా, వైద్య రంగాలను పూర్తిగా విస్మరించారన్నారు. ఈ బడ్జెట్ ప్రజానీకం తీవ్రంగా వ్యతిరేకించాలని కోరారు.
మోడీ ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను నాలుగు లేబర్కోడ్స్గా మార్చి కార్మికులను యజమాన్యాలకు బానిసలుగా చేస్తుందన్నారు. ఈ లేబర్ కోడ్స్ అమలు జరిగితే కార్మికులు సమ్మె చేసే హక్కును సంఘం పెట్టుకొని హక్కును యాజమానితో బేరసారలాడే హక్కును కోల్పోతారన్నారు. ఈ లేబర్కోడ్స్ వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతారు. కావున తక్షణమే నాలుగు లేబర్ కోర్సును విరమించుకోవాలని డిమాండ్ చేసారు.
- Advertisement -