33.3 C
New York
Tuesday, July 16, 2024

ఆషాడ మాస బోనాల దశాబ్ది ఉత్సవాల నిర్వహణ

- Advertisement -

తెలంగాణ ఆషాడ మాస బోనాల దశాబ్ది ఉత్సవాలను ఆర్భాటంగా
అట్టహాసంగా అత్యంత వైభవొపేతంగా నిర్వహణ
హైదరాబాద్
తెలంగాణ ఆషాడ మాస బోనాల దశాబ్ది ఉత్సవాలను ఆర్భాటంగా, అట్టహాసంగా, అత్యంత వైభవొపేతంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ తెలిపారు.
శనివారం బేగంపేట హరిత టూరిజం ప్లాజాలో బోనాల దశావృత్సవాలు -2024 ఏర్పాట్లకు సంబంధించిన చెక్కులను దేవాలయాల కమిటీలకు పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ, హైదరాబాద్ జిల్లా ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ. తెలంగాణ బోనాల జాతర ప్రతి సంవత్సరం జరుగుతుందని, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఆర్భాటంగా, అట్టహాసంగా,అత్యంత వైభవితంగా నిర్వహించేందుకు ఆషాడ మాస బోనాలు దశాబ్ది ఉత్సవాల నిర్వహణ కోసం గతం కంటే ఎక్కువ నిధులు రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్లు కేటాయించిందన్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అనేక సమావేశాలు నిర్వహించడం జరిగిందన్నారు.
బోనాల ఉత్సవాలను పకడ్బందీగా నిర్వహించేందుకు జూన్ 15న డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం బ్రాకెట్లో ఏమన్నా ఎం సి ఆర్ హెచ్ ఆర్ డి  లో రాష్ట్రస్థాయి అధికారులతో సమావేశం, జూన్ 20న హైదరాబాద్ కలెక్టరేట్ లో జిల్లా స్థాయి అధికారులతో సమావేశం, జూన్ 25న బల్కంపేట శ్రీ ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో వివిధ శాఖల అధికారులతో, జూన్ 26న బేగంపేట హరిత ప్లాజాలో ఉన్నతాధికారులు, దేవాలయాల కమిటీ సభ్యులతో, జూన్ 26న గోల్కొండ కోట జగదాంబ మహంకాళి దేవస్థానంలో అధికారులు, దేవాలయ కమిటీ సభ్యులు, పీస్ కమిటీ సభ్యులతో ఆషాడ మాసం బోనాలు విజయవంతంగా నిర్వహించడానికి సమావేశాలు నిర్వహించడం జరిగిందని మంత్రి తెలిపారు. జూన్ 7 నుండి ఆగస్టు 4 వరకు నిర్వహించు ఆషాడ మాసం బోనాలు ఏ దేవాలయంలో ఏ రోజు నిర్వహిస్తారు అనే వివరాలతో కూడిన పాంప్లెట్ ను వాట్సప్ ద్వారా, ఇతర మార్గాల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని కమిటీ సభ్యులకు కోరారు.
జూలై 7న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయంలో బోనాలు, తొట్టెల, రథం ఊరేగింపు మరియు మెట్ల పూజ, సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఘటోత్సవము, జులై 8న బల్కంపేట శ్రీ ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో ఎదుర్కోళ్లు ఉత్సవం, సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఘటోత్సవం, జూలై 9న ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో కళ్యాణం, సికింద్రాబాద్ సే ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఘటోత్సవం, జులై 10న బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ దేవస్థానంలో చండీ హోమం, రథోత్సవం, మహంకాళి దేవాలయంలో ఘటోత్సవం, జులై 11న గోల్కొండ శ్రీ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనాలు, సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఘటోత్సవం, జూలై 12న మరియు 13 న సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో ఘటోత్సవం, జూలై 14న గోల్కొండ మహంకాళి దేవాలయంలో బోనాలు, అంబర్పేట శ్రీ మహంకాళి దేవాలయంలో, జూలై 15న నుండి జూలై 17 వరకు సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం, అంబర్పేట శ్రీ మహంకాళి దేవాలయంలో ఘటోత్సవం, జూలై 18న గోలకొండ శ్రీ జగదంబ మహంకాళి ఆలయంలో బోనాలు చండీ హోమం, పూర్ణహుతి, సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి దేవాలయం, అంబర్పేట శ్రీ మహంకాళి దేవాలయంలో ఘటోత్సవము, జూలై 19న లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి దేవాలయం, ఉప్పు గూడ, శ్రీ మహంకాళి దేవాలయం, శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, హరి బౌలి శ్రీ అక్కన్న మాదన్న దేవాలయం శాలిబండ, మిర్యాల మండి శ్రీ మహంకాళేశ్వర దేవాలయం, గౌలిపుర శ్రీ మహంకాళి దేవాలయం, శ్రీ భారత మాత కోట మైసమ్మ దేవాలయం, హైదరాబాద్,మురాద్ మహల్ శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం, శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, సుల్తాన్ షాహి శ్రీ జగదంబ దేవాలయం, రాక్షస బండ శ్రీ బంగారు మైసమ్మ దేవాలయం, సిబిఐ క్వార్టర్స్ లోని శ్రీ నల్ల పోచమ్మ దేవాలయం, అలియాబాద్ శ్రీ దర్బార్ మైసమ్మ దేవాలయం, అలీజ కోట్ల శ్రీ మహంకాళి దేవాలయం లలో కలశ స్థాపన కుంకుమార్చన, సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం, అంబర్పేట శ్రీ మహంకాళి దేవాలయం లో ఘటోత్సావము, జూలై 21న అమ్మవారి ఘట స్వాగతం, జూలై 22న సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో రంగం భవిష్యవాణి, అంబానీ ఊరేగింపు మరియు మహా హారతి, అంబర్పేట్, కార్వాన్ ఘటోత్సవం, హోమం, జూలై 23న అంబర్పేట్, సబ్సిడీ నటరాజ్ నగర్ కార్వాన్ లో ఘాటోత్సవము ఊరేగింపు కార్యక్రమాలు, జూలై 24న లాల్ దర్వాజా, ఉప్పుగూడ, హరి బౌలి శాలిబండ, మిర్యాల మండి గౌలిపుర, హైదరాబాద్ మురాద్ మహల్, సుల్తాన్ షాహి రామ్భక్షబండ, సిబిఐ క్వార్టర్స్, అలియాబాద్, అలీజాకోట్ల, అంబర్పేట్ కార్వాన్ దేవాలయాల్లో శాకాంబరి అలంకరణ దర్శనం, ఉత్సవము మరియు హోమం, జూలై 25న గోల్కొండ, అంబర్పేట్, కార్వా, ముస్లిం గంజ్ దేవాలయాల్లో బోనాలు ఘటోత్సవము హోమం, ఘట స్థాపన, జూలై 26న సబ్జీమండి, నటరాజ్ నగర్, అంబర్పేట, మిర్యాల మండి, ఉప్పు గూడ లోని దేవాలయాల్లో హోమం ఘటోత్సవము, శాంతి కళ్యాణం, జూలై 27న కార్వాన్, అంబర్పేట్, ముస్లిం గంజ్ బ్రిడ్జి, సబ్జీ మండి, నరాజనగర్, గోల్కొండ లాల్ దర్వాజా హరిబౌలి లోని దేవాలయాల్లో అభిషేకం, మైల బోనం, ఊరేగింపు, ఘటోత్సవము కళ్యాణం, జూలై 28న మురాద్ మహల్, హరి బౌలి, ముస్లిం గంజ్ బ్రిడ్జి, సబ్జి మండి, నటరాజ్ నగర్, చిలకలగూడ, ఉప్పు కూడా మిర్యాల మండి, గౌలిపుర, సుల్తాన్ షాహి, హరి బౌలి, రామ్భక్షబండ, అలియాబాద్, సిబిఐ క్వార్టర్స్, బోయిగూడ, అలిజా కోట్ల, అంబర్పేట్, కార్వాన్, చార్మినార్ ఎన్టీఆర్ నగర్, ఎల్బీనగర్ నాచారం లోని దేవాలయాలలో బోనాలు, శాంతి కళ్యాణం రంగం రథయాత్ర అభిషేకం అంబారీ ఊరేగింపు తొట్టెల ఊరేగింపు కార్యక్రమాలు, జూలై 29న హరి బౌలి, చిలుకల గూడ, ఉప్పుగూడ, లాల్ దర్వాజా, మిర్యాల మండి, హైదరాబాద్ సుల్తాన్ షాహి, ముస్లిం గంజి బ్రిడ్జి, అంబర్పేట్ లోని రంగం అంబారి ఊరేగింపు, సామూహిక ఊరేగింపు, జూలై 30న
లాల్ దర్వాజా, ఉప్పుగూడ, హరి బౌలి, మిర్యాల మండి, గౌలిపుర, మురాద్ మహల్, రామ్ బక్ష బండ, సుల్తాన్ షాహి, సిబిఐ క్వార్టర్స్, అలియాబాద్ అలిజాకోట్ల లోని దేవాలయంలో అమ్మవారి పూజ, ఆగస్టు 1న గోల్కొండ శ్రీ జగదంబ మహంకాళి దేవాలయంలో బోనాలు, ఆగస్టు 4న గోల్కొండ శ్రీ జగంబ మహంకాళి దేవాలయంలో బోనాలు మరియు కుంభహారతి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ. హైదరాబాద్ సాంస్కృతి సంప్రదాయాలను రాష్ట్ర, దేశవ్యాప్తంగా నిలిచేలా ఉత్సవాలను నిర్వహించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ, తాను, రంగారెడ్డి జిల్లా ఇంచార్జ్ శ్రీధర్ బాబు అధికారులను, స్థానిక దేవాలయాల కమిటీలను భాగస్వామ్యం చేసుకుంటూ ఉత్సవాలు విజయవంతం అయ్యేలా చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసిన ఉత్సవాల విజయవంతరానికి ప్రజల సహకారం కావాలన్నారు. శాంతిభద్రతలను కాపాడుతూ ఉత్సవాలను విజయవంతం చేయడానికి స్థానిక ప్రజలు భాగస్వాములు కావాలని అన్నారు. నిర్వహణలో ఎలాంటి లోటుపాటు లేకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అందరికీ ఆషాడ మాస బోనాలు ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా సమృద్ధిగా వర్షాలు పడి మంచి పంటలు పండాలని ప్రజలంతా సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలిపారు. మంత్రులు. బోనాల పండుగ సందర్భంగా ఏర్పాట్ల కోసం వివిధ దేవాలయాల కమిటీ సభ్యులకు చెక్కులను పంపిణీ చేశారు.
బోనాల ఉత్సవ క్యాలెండర్ కాఫీ టేబుల్ బుక్ ఈవెంట్ క్యాలెండర్, ఉత్సవాల పోస్టర్, బోనాల పండుగ పై మామిడి హరికృష్ణ రాసిన పుస్తకం, బోనాల పండుగ పై పాట సిడిని మంత్రులు కొండ సురేఖ పొన్నం ప్రభాకర్ ఆవిష్కరించినారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ రామయ్య, దేవదాయ శాఖ, సమాచార శాఖ కమిషనర్ హన్మంతరావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, సంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, అదనపు కలెక్టర్ రెవెన్యూ వెంకటాచారి, వివిధ దేవాలయాల కమిటీ సభ్యులు, దేవదాయ శాఖ దీప్తి కమిషనర్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

spot_img

Latest Articles

error: Content is protected !!