మన బ్రతుకులు మారేది ఎన్నడు
Our lives will never change
ప్రముఖ గాయకుడు, సంఘ సేవకులు,గద్దల శశిభూషణ్ స్వరకల్పనలో
శశి రాగాలు, వీడియో ఆడియో ఆవిష్కరణ
ఖని, కూరగాయల మార్కెట్లో ఆత్మీయుల సమక్షంలో అంగరంగ వైభవంగా ఆడియో వీడియో రిలీజ్ ఫంక్షన్
గోదావరి ఖని
ప్రముఖ గాయకులు సంఘ సేవకులు, కోల్ బెల్ట్ ప్రాంత కళామతల్లి ముద్దుబిడ్డ, గద్దల శశిభూషణ్ స్వరకల్పనలో రూపొందించిన, మన బతుకులు మారేది ఎన్నడు,, ఆడియో వీడియో యూట్యూబ్ ఛానల్,శశి రాగాలు, పేరిట బుధవారం గోదావరిఖని పట్టణంలోని కూరగాయల మార్కెట్ హోల్ సేల్ అసోసియేషన్ అధ్యక్షులు దుండ మల్లేష్ ఆధ్వర్యంలో ఆత్మీయుల మధ్య అంగరంగ వైభవంగా ఆవిష్కరణ జరిగింది, ప్రముఖ జర్నలిస్టు స్వచ్ఛంద సంస్థల సలహాదారులు దయానంద్ గాంధీ అధ్యక్షతన జరిగిన ఆడియో వీడియో ఆవిష్కరణ కార్యక్రమంలో గోదావరిఖని హోల్ సేల్ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది దుoడెమల్లేశం, ప్రముఖ బుల్లితెర వెండితెర దర్శకులు దామెర శంకర్, ప్రముఖ,సీనియర్ జర్నలిస్టు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు (గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ) ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు,,లు, అతిథుల అందరి సమక్షంలో ఆవిష్కరించారు, సామాన్య ప్రజల బతుకులను కళ్ళకు అద్దినట్టు ఆడియో వీడియో రూపొందించిన, గాయకులు గద్దల శశి భూషణ్ ను, పలువురు అభినందించారు.
ఈ ప్రాంతంలో పుట్టి పెరిగి ప్రజల ప్రధానంగా హోల్ సేల్, కూరగాయల మార్కెట్, చికెన్,మటన్, ఫిష్ మార్కెట్ వ్యాపారులతో అవినాభావ సంబంధంతోపాటు మార్కెట్ కి వచ్చే వినియోగదారులను ఆత్మీయంగా పలకరించే గద్దల శశిభూషణ్ మరిన్ని ప్రజల బతుకులకు సంబంధించిన వీడియో ఆడియోలు చేయాలని పలువురు అతిథులు కోరారు, మన బ్రతుకులు మారేది ఎన్నడు వీడియోలో నటించిన దామెర రాజేష్ ను కూడా పలువురు అభినందించారు, ఎన్నో వ్యాయా ప్రయాసలకోర్చి ఆడియో వీడియో రిలీజ్ చేసిన గద్దల శశి భూషణ్ ను, కూరగాయల మార్కెట్ చికెన్ మార్కెట్, ఫిష్ మార్కెట్, మటన్ మార్కెట్ అసోసియేషన్ నాయకులు వ్యాపారస్తులు శాలువాతో ఘనంగా సన్మానించారు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛంద సంస్థల గౌరవ అధ్యక్షులు దయానంద్ గాంధీ అధ్యక్షతన,జరిగిన కార్యక్రమంలో గోదావరిఖని హోల్ సేల్ కూరగాయల మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది, దుoడే మల్లేశం, ప్రముఖ దర్శకులు దామెరశంకర్, ప్రముఖ జర్నలిస్టు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు, డైరెక్టర్ నగునూరి విజయ్ కుమార్ గోదావరి కళా సంఘాల సమైక్య గౌరవ సలహాదారులు కాశిపాక రాజమౌళి, ప్రధాన కార్యదర్శి మ్యాదరి వాసు, డాన్స్ మాస్టర్ బీరుక లక్ష్మణ్,ప్రముఖ మేకబిస్ట్ తిప్ప బత్తిని అంజి,, మటన్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు గోలి కార్ రాము,
చికెన్ మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షులు ముజాహిద్, కూరగాయల మార్కెట్, మటన్ చికెన్ ఫిష్ హోల్ సేల్ మార్కెట్ వ్యాపారులు అసోసియేషన్ నాయకులు, నల్ల రవీందర్ ఆడెపు విటల్ కలవేని సంపత్, ఆడపు చంద్రశేఖర్ చందు మహమ్మద్ ఖలీమ్ ఆర్వి,, సాదిక్, మిట్టపల్లి మొగిలి ,వెంకటేష్ మల్లయ్య పల్లె మహేష్ తదితరులు పాల్గొన్నారు