చకోర ” సినిమా నుంచి ‘శివ ట్రాన్స్..’ వీడియో సాంగ్
‘Shiva Trans…’ video song from the movie *Chakora*
High Joy Commercials బ్యానర్ పై డా. చింతాడ హేమారావు నిర్మాతగా, VIP – Vintage Iconic Pictures నిర్మాణ సారథ్యంలో మంగా శ్రీనివాస్ రచన- దర్శకత్వంలో రూపొందిన మాస్ పోయెట్రీ మ్యూజికల్ లవ్ స్టోరీ “చకోర – Lunar Love Bird”. శ్రవణ్, మలైకా టి. వాసుపల్ ను సరికొత్త ప్రేమ జంటగా పరిచయం చేస్తూ తెరకెక్కిన ఈ ప్రేమ కథ చిత్రం శ్రీ లక్ష్మి పిక్చర్స్ ద్వారా అక్టోబర్ 9న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు ఈ సినిమా నుంచి ‘శివ ట్రాన్స్..’ వీడియో సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘శివ ట్రాన్స్..’ వీడియో సాంగ్ ను ర్యాప్ బీట్ తో ప్రిన్స్ హెన్రీ ఎనర్జిటిక్ గా కంపోజ్ చేశారు. సరస్వతీపుత్ర రామజోగయ్య శాస్త్రి సాహిత్యాన్ని అందించారు. రితేష్ రావ్ పాడారు. ‘శివ ట్రాన్స్..’ వీడియో సాంగ్ ను ప్రమోషనల్ సాంగ్ గా రూపొందించారు. వైజాగ్ బీచ్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ పాటను కలర్ పుల్ గా తెరకెక్కించారు. ర్యాప్ బీట్ తో శివుడిని స్తుతిస్తూ పాట డిజైన్ చేయడం కొత్త ప్రయత్నంగా చెప్పుకోవచ్చు. ఈ పాటలో మూవీ టీమ్ మెంబర్స్ పాల్గొనడం విశేషం.
నటీనటులు – శ్రవణ్, మలైకా టి వాసుపల్, అనుష్క లూహార్, యామిని, ఎల్ బి శ్రీరామ్, సుమన్, బ్రహ్మాజీ, ఇంద్రజ, మణి చందన, నెల్లూరు సుదర్శన్, ప్రభావతి, మాధవి ప్రసాద్, జనార్దన్, ఆకెళ్ళ గోపాల కృష్ణ, వంగపండు,వంశీ, సుమంత్, భాను, సూర్య మాకిరెడ్డి, తదితరులు
చకోర ” సినిమా నుంచి ‘శివ ట్రాన్స్..’ వీడియో సాంగ్

- Advertisement -
- Advertisement -



