Tuesday, January 21, 2025

మా యువరాణి ఆరా వచ్చేసింది : యువరాజ్  సింగ్

- Advertisement -
Our princess has arrived : Yuvraj Singh
Our princess has arrived : Yuvraj Singh

యువరాజ్ కు యువరాణి పుట్టింది

ముంబై, ఆగస్టు 26: టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ తన ఫ్యామిలీలోకి మరో పర్సన్ ని ఆహ్వానించాడు. ఆయన భార్య హాజెల్ కీచర్ తాజాగా బంగారం లాంటి పాపకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని యువీ తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. అభిమానుతో గుడ్ న్యూస్ పంచుకున్నాడు. తమ చిన్నారికి అప్పుడే పేరు కూడా పెట్టినట్లు వివరించాడు. ‘ఆరా’ అనే పేరు ఫిక్స్ చేసినట్లు వెల్లడించాడు. ఆమె రాకతో తమ ఫ్యామిలీ ఫుల్ ఫిల్ అయినట్లు చెప్పాడు. గత ఏడాది వీరిద్దరికి ఓ బాబు పుట్టాడు. అతడికి ఓరియోన్ అని పేరు పెట్టారు.తాజాగా తన కూతురుకు సంబంధించిన ఫోటోలను యూవీ షేర్ చేశారు. భార్య హజెల్ కీచ్ బాబుకు పాలు పట్టిస్తుండగా, యువీ చిన్నారిని ఎత్తుకుని పాలు పెడుతున్నాడు.  ఈ ఫోటోకు చక్కటి క్యాప్షన్ రాశాడు. ‘‘మా యువరాణి ఆరా వచ్చేసింది. ఆమె కారణంగా నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. అయినా, సంతోషంగానే ఉంది. ఆరా రాకతో మా కుటుంబం సంపూర్ణం అయ్యింది” అని వెల్లడించాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పలువురు సినీ, క్రీడా ప్రముఖులతో పాటు అభిమానులు యూవీ దంపతులకు శుభాకాంక్షలు చెప్తున్నారు.    టీమిండియా ఆల్ రౌండర్ గా కొనసాగిన యూవీ 2019లో అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి వైదొలిగాడు. భారత క్రికెట్ జట్టు సాధించిన ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో ఆయన కీలక పాత్ర పోషించాడు. 2007లో టీమిండియా టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్ గెలవడంలో ఆయన ఎంతో కృషి చేశాడు. అద్భుత ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 

Our princess has arrived : Yuvraj Singh
Our princess has arrived : Yuvraj Singh

యువరాజ్ అనగానే 2007 టీ20 ప్రపంచ కప్‌ గుర్తొస్తుంది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌ లో  6 బంతుల్లో 6 సిక్సర్లతో విరుచుకు పడ్డాడు. క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాడు. 2011 వన్డే ప్రపంచకప్‌లో ఆల్‌ రౌండర్‌ గా రాణించాడు. బ్యాటింగ్‌ లో 362 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 15 వికెట్లు తీశాడు. దీంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును యువరాజ్ అందుకున్నాడు. క్యాన్సర్‌ మహమ్మారి సోకి తీవ్ర ఇబ్బందులు పడ్డాడు యూవీ. చికిత్స తర్వాత తిరిగి కోలుకున్నాడు. ఆ తర్వాత తిరిగి క్రికెట్ జట్టులోకి అడుగు పెట్టి అద్భుత ఆటతీరుతో అలరించాడు. 2019లో క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.అటు  మోడల్‌, బాలీవుడ్‌ నటి అయిన హాజల్ కీచ్ ను యువీ ప్రేమ వివాహం చేసుకున్నారు. సుమారు 4 ఏండ్ల పాటు ప్రేమాయణం కొనసాగించారు. 2016, నవంబరు 30న మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. జనవరి 25, 2022లో బాబు ఓరియోన్‌ జన్మించాడు. తాజాగా కూతురు ఆరా పుట్టింది. 

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్