OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘హనీ’ టీజర్ రిలీజ్ – నవీన్ చంద్ర సైకలాజికల్ హారర్‌లో కొత్త అవతారం
OVA Entertainments’ ‘Honey’ Teaser Released – Naveen Chandra’s New Avatar in Psychological Horror
నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో కరుణ కుమార్ రచన, దర్శకత్వం వహించిన సైకలాజికల్ హారర్ మూవీ హనీ. OVA ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రాన్ని శేఖర్ స్టూడియోస్ సమర్పిస్తోంది.
ఈ చిత్రం నిజ జీవిత సంఘటనల నుంచి ప్రేరణ తో మూఢనమ్మకాలు, అంధ విశ్వాసాలు, డార్క్ సైకలాజిక్ ఎలిమెంట్స్ తో ఉండబోతోంది.
తాజాగా ఈ చిత్రం టీజర్ రిలీజ్ చేశారు. వెన్నులో వణుకు పుట్టించేలా వున్న టీజర్ సినిమాపై అమాంతం ఆసక్తిని పెంచింది.
ఇప్పటివరకు మనం చూసిన హారర్ కు భిన్నంగా, Honey టీజర్ పూర్తిగా ritual-based horror తో.. నిశ్శబ్దం, చీకటి, మర్మమైన చూపులు, తెలియని శక్తులు— ఇవన్నీ కలిసి ఒక మార్మిక ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్నాయి.
దర్శకుడు కరుణ కుమార్ ఇప్పటివరకు ఎన్నడూ చూడని కథను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాడనే సంకేతాలు టీజర్‌లో బలంగా వినిపిస్తున్నాయి. హారర్‌ను కేవలం భయపెట్టే అంశంగా కాకుండా ఊహకు అతీతంగా ప్రజెంట్ చేస్తున్న విధానం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ “ఏదో పెద్ద రహస్యం దాగుంది” అన్న ఫీలింగ్ కలుగుతుంది.
నవీన్ చంద్ర లుక్ పెర్ఫార్మెన్స్ స్టన్నింగ్ గా వుంది. దివి, రాజా రవీంద్ర పాత్రలు కూడా భిన్నంగా కనిపించాయి.
అజయ్ అరసాడ సంగీతం బీజీఎం గూస్బంప్స్ తెప్పించింది. ఈ చిత్రానికి టాప్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్, నాగేష్ బానెల్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
సైకాలజికల్ డెప్త్, సోషల్ రిలవెన్స్, హారర్ అంశాల సమ్మేళనంతో రూపొందిన ‘హనీ’ ఫిబ్రవరి 6న ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించేందుకు సిద్ధంగా ఉంది.
తారాగణం: నవీన్ చంద్ర, దివ్య పిళ్లై, దివి, రాజా రవీందర్, జయన్ని, జయత్రి


