- Advertisement -
స్నేహితుల ప్రాణాలు తీసిన ఓవర్ స్పీడింగ్
Over speeding that took the lives of friendsహైదరాబాద్ కొత్త ప్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం
ఎలక్ట్రిక్ పోల్ ను ఢి కొట్టి……ఢీవైడర్ ను ఢీ కొట్టిన బైక్
హైదరాబాద్
బహదూర్ పూరా ఫ్లై ఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన బైకు అదుపు తప్పి విద్యుత్ పోల్ ను ఢీకొంది. తరువాత డివైడర్ ను ఢీకొంది. ఘటనలో ఇద్దరు మైనర్లు స్పాట్ లో ప్రాణాలు కోల్పోయారు. మరో మైనర్ బాలుడికి తీవ్ర గాయాలు అయ్యాయి. అతడిని హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. మార్గ మద్య లో ప్రాణాలు విడిచాడు. బహదూర్ పూరా కు చెందిన మైనర్లు గా గుర్తించారు. మాస్ ఖాద్రీ, మహ్మద్ అహ్మద్ ఇంట్లో తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. చెట్టంత ఎదిగిన కొడుకులను కోల్పోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. బహదూర్ పూరా నుండి ఆరంఘర్ వైపు కొత్త ఫ్లై ఓవర్ పై బైక్ పై వెళుతున్న సమయంలో ఘటన జరిగింది. శివరాంపల్లి సమీపంలోకి రాగానే ఎలక్ట్రిక్ ఫోల్ ను ఢి కొట్టింది. మితిమీరిన వేగం……త్రిబుల్ రైడింగ్ గే ప్రమాదానికి కారణమని పోలీసులు అంటున్నారు. అత్తాపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -




