Sunday, September 8, 2024

ఎన్నికల్లో అతి విశ్వాసం ప్రమాదకరం

- Advertisement -

పార్టీ క్యాడర్ ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి
గడప గడపకు వెళ్లి ఓటర్లను పలకరించి మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను గుర్తు చేయాలి
 రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ పిలుపు

వేములవాడ: అతి విశ్వాసం చాలా ప్రమాదకరం. ఓవర్ కాన్ఫిడెన్స్ లోకి పోతే దెబ్బ తింటాం. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికలను సీరియస్ గా తీసుకొని క్షేత్రస్థాయిలో పనిచేయాలి అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

గురువారం వేములవాడ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, బి ఆర్ ఎస్ పార్టీ కో-ఆర్డినేటర్స్, సీనియర్ నాయకులు, పార్టీ  ముఖ్య కార్యకర్తల సమావేశంలో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసే వరకు పార్టీ ప్రతి కార్యకర్త అప్రమత్తంగా ఉండాలని అన్నారు. గడపగడపకు వెళ్లి ఓటర్ లతో వ్యక్తిగతంగా మాట్లాడి మన రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను మరోసారి గుర్తుచేయాలని మనోజ్ కుమార్ సూచించారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంగా యువతి యువకులను ఆత్మవిశ్వాసంలోకి తీసుకోవాలని, వారి ఓటింగ్ పై ప్రధానంగా దృష్టిని కేంద్రీకరించాలని వినోద్ కుమార్ పార్టీ క్యాడర్ కు సూచించారు.

ఎవరు అవునన్నా కాదన్నా గ్రామ స్థాయిలో సర్పంచులు, వార్డ్ మెంబర్లు, పట్టణాల స్థాయిలో కౌన్సిలర్లు, నగరాల స్థాయిలో కార్పొరేటర్ల పాత్ర ఎన్నికలలో కీలకంగా ఉంటుందని, వారంతా ఇంటింటికి వెళ్లి ఓటర్లతో ఆత్మీయ సమావేశాలు నిర్వహించాలని వినోద్ కుమార్ సూచించారు.

రాష్ట్రంలో బిజెపి పరిస్థితి అధ్వానంగా తయారైందని రాష్ట్రంలో ఆ పార్టీ పాతాలంలోకి పోయిందని, దీనివల్ల కాంగ్రెస్ కొంత లేచినట్లు కనిపిస్తోంది తప్ప రాష్ట్రంలో కాంగ్రెస్, బిజెపిలకు రాజకీయంగా స్థానం లేదని వినోద్ కుమార్ వివరించారు.

వేములవాడ పట్టణాన్ని గొప్పగా తీర్చిదిద్దేందుకు సీఎం కేసీఆర్ గుర్తు నిశ్చయంతో ఉన్నారని, రానున్న రోజుల్లో వేములవాడ పట్టణ స్వరూపమే మారిపోతుందని వినోద్ కుమార్ అన్నారు.

వేములవాడలో కొలువుతీరిన దక్షిణ కాశీ క్షేత్రం అయినా శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయాన్ని గొప్ప పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేసేందుకు బృహత్ కార్యాచరణను ఇప్పటికే సీఎం కేసీఆర్ రూపొందించారని, త్వరలోనే ఈ కార్యచరణ ఊపందుకుంటోంది వినోద్ కుమార్ పేర్కొన్నారు.

ఈ సమావేశంలో వేములవాడ మున్సిపల్ చైర్ పర్సన్ మాధవి రాజు, బి ఆర్ ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పోల్కం రాజు, పార్టీ సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్