Thursday, March 27, 2025

 వరద బాధితులకు ప్యాకేజీ కసరత్తు

- Advertisement -

 వరద బాధితులకు ప్యాకేజీ కసరత్తు 

Package exercise for flood victims

గుంటూరు, సెప్టెంబర్ 12, (న్యూస్ పల్స్)
విజయవాడ వరదల్లో నీట  మునిగిన ఇళ్ల బాధితుల కోసం ప్రభత్వం  పరిహారం ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే ఎన్యూమరేటర్లు ఇంటింటికి తిరిగి నష్టం అంచనా వేస్తున్నారు నష్టం అంచనాలు పూర్తయిన తర్వాత బాధితుల ఖాతాల్లోకి నగదు జమ చేయనున్నారు.ఎంత ఎంత పరిహారం ఇవ్వాలన్నదానిపై కసరత్తు చేస్తున్నారు.నీట మునిగిన ఇళ్ల విషయంలో ప్రభుత్వం మరింత ఉదారంగా ఉండాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. అలాంటి ఇళ్లకు కనీస పరిహారంగా రూ. పాతిక వేల రూపాయలు ఇవ్వాలన్న ఆలోచనలో ఉంది. అలాగే ఆ ఇంట్లో ధ్వంసమైన ఎలక్ట్రానిక్ వస్తువులు, వాహనాల రిపేర్ల కోసం కూడాకొంత మంది పరిహారం  ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది. ఇక పూర్తికా కాకపోయినా కొంత మొత్తంలో నీరు వచ్చిన ఇళ్లకు కూడా రూ. పది వేల చొప్పున పరిహారం ఇచ్చే అవకాశం ఉంది. రిపేర్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బైకులు వంటి వాటి కోసం అదనపు పరిహారం చెల్లించేందుకు కసరత్తు చేస్తోంది.  బుడమేరు ముంపు కారణంగా వచ్చిన వరదలతో సింగ్ నగర్ తో పాటు ఆ చుట్టుపక్క ప్రాంతాలన్ని తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పల్లపు ప్రాంతాల్లో మొదటి అంతస్తు వరకూ నీరు వచ్చాయి. ఈ కారణగా ఎవరూ తమ ఇళ్లల్లో ఉండలేకపోయారు. అలాగే విలువైన  వస్తువుల్నికూడా తీసుకెళ్లలేకపోయారు నీట మునిగి బైకులు ఎందుకు పనికి రాకుండా పోయాయి. చాలా మందికి ద్విచక్ర వాహనం ఉపాధి కి కీలకం. అందుకే ప్రభుత్వం  వాహనాల రిపేర్లకు.. ప్రత్యేక  పరిహారం ఇవ్వాలనుకుంటోంది. ఇక ఇతర ప్రాంతాల్లో  వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది. పంట నష్టంపై అంచనాలు వేస్తున్నారు. మిగతా పరిహారంతో  పాటు పంటలకు కూడా పరిహారంజమ చేయనున్నారు. గతంలో ఇచ్చే దాని కన్నా ఎక్కువ పరిహారం  ఇవ్వాలని ప్రభుత్వం  భావిస్తోంది. వరదల వల్ల జరిగిన  పంట నష్టానికి సంబంధించిన వివరాలను.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపారు. డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చే నిధులతో పరిహారం జమ చేసే అవకాశం ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్